close
Choose your channels

పూజాకు భారీ ఆఫర్...

Saturday, June 10, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒక లైలా కోసం, ముకుంద చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన పూజా హెగ్డే త‌దుప‌రిగా మొహంజ‌దారో అనే బాలీవుడ్ చిత్రంలో న‌టించింది. ఆ చిత్రం బాలీవుడ్ ప్లాప్ కావ‌డంతో పూజా హెగ్డే టాలీవుడ్‌పైనే కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేసింది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ స‌ర‌స‌న డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రంలో న‌టించింది.

ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గానే పూజా హెగ్డే భారీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ట‌. ఇంత‌కు అదేంటంటే బెల్లంకొండ సురేష్ త‌న‌యుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రంలో హీరోయిన్‌గా న‌టించమ‌ని, దాదాపు కోటి రూపాయ‌లు ఆఫ‌ర్ చేసిన‌ట్లు వినికిడి. ఏదేమైనా పూజా హెగ్డే రెమ్యున‌రేష‌న్ ప‌రంగా మంచి అవ‌కాశాన్నే కొట్టేసింద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.