close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి, పింకీలను ముద్దు అడిగిన జెస్సీ.. వారియర్ అనిపించుకున్న రవి

Thursday, November 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి, పింకీలను ముద్దు అడిగిన జెస్సీ.. వారియర్ అనిపించుకున్న రవి

బిగ్‌బాస్ 5 తెలుగు‌లో ఈరోజు ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. జెస్సీ, సిరి, ప్రియాంకల మధ్య ముద్దు గోల నడిచింది. ప్రియాంక‌పై మానస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫస్ట్ అన్నయ్య అంటుందని ఆ తర్వాత పోరా బచ్చా అని పిలుస్తుందని కామెంట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్‌లో రవి తన మార్క్ స్ట్రాటజీ అమలు చేసి గెలిచేందుకు ప్రయత్నించాడు. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారు.. ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు చోటు చేసుకున్నాయి. తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి, పింకీలను ముద్దు అడిగిన జెస్సీ.. వారియర్ అనిపించుకున్న రవి

షో ప్రారంభమైన వెంటనే యానీ మాస్టర్ తన పవర్‌ని వాడి మానస్‌ని సేవ్ చేయడం తనకు నచ్చలేదని శ్రీరామ్.. రవితో అన్నాడు. ఆ తరువాత నేరుగా యానీతో తేల్చుకుందామని ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడాడు శ్రీరామ్. 'ఎవరైతే కలిసి ఆడుతున్నారో వాళ్లు బాగానే ఉంటున్నారు.. మనం ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటున్నప్పటికీ.. మనలో మనకే డిఫరెన్స్ లు వస్తున్నాయని' చెప్పాడు. రవికి పవర్ యూజ్ చేయాల్సిందని శ్రీరామ్ సలహా ఇచ్చాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి, పింకీలను ముద్దు అడిగిన జెస్సీ.. వారియర్ అనిపించుకున్న రవి

అనంతరం పింకీని ఉద్దేశిస్తూ హాట్‌ కామెంట్‌ చేశాడు మానస్‌. ప్రియాంక తన గేమ్‌ తాను ఆడుతుందని, ఎవరు చెప్పినా వినదని అన్నాడు. ఎవరు ఏం చెప్పినా సరే అన్నయ్యా అంటుందని.. ఆ తర్వాత పోరా బచ్చా అనుకుంటుందని అన్నాడు. నిన్ను ఎవరైనా నామినేట్‌ చేస్తే వాళ్లు ఇక అయిపోవాలి అనేట్టుగా ప్రవర్తిస్తుంటావని డైరెక్ట్‌గా పింకీతో అన్నాడు. తర్వాత జెస్సీ బెడ్‌పై పడుకుని వుండగా, అతని పక్కన సిరి కూర్చొని ఉంది. వీరిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. అంతలో పింకి అక్కడికి వచ్చింది. ‘‘ నువ్వు సుఖ పురుషుడివిరా’’ అంటూ హాట్‌ కామెంట్‌ చేసింది. అంతేకాదు జెస్సీ పక్కన పడుకుని జుట్టు, నుదురు నిమురుతూ అతనిని రెచ్చగొట్టేలా ప్రవర్తించింది. దీనికి రియాక్ట్ అయిన జెస్సీ.. ఇద్దరూ కలిపి ఒక ముద్దు పెడితే బాగుంటుంది' అని తన కోరిక చెప్పాడు. ఇది విని షాకైన సిరి కెమెరా నుంచి కాలు వచ్చి తంతుందని సెటైర్‌ వేసింది. ఏంటీ ముద్దులు ఇస్తారా..? ఇవ్వరా అని అడగ్గా.. ఇద్దరూ ససేమీరా అనడంతో వాళ్లిద్దరినీ తన బేబీలని చెప్పాడు జెస్సీ.

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి, పింకీలను ముద్దు అడిగిన జెస్సీ.. వారియర్ అనిపించుకున్న రవి

ఇక బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఇచ్చారు. అది 'సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్'. దీనికోసం ఇంట్లోని సభ్యులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు సూపర్ విలన్స్, మరో గ్రూప్ సూపర్ హీరోస్. ఏ గ్రూప్ అయితే టాస్క్ లో గెలుస్తుందో.. వాళ్లు కెప్టెన్సీ పోటీదారులవుతారు. హీరోస్ గ్రూపులో షణ్ముక్, ప్రియాంక, కాజల్, శ్రీరామచంద్ర, మానస్ ఉండగా.. విలన్స్ గ్రూపులో రవి, యానీ మాస్టర్, సన్నీ, జెస్సీ, విశ్వ, సిరి ఉన్నారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి, పింకీలను ముద్దు అడిగిన జెస్సీ.. వారియర్ అనిపించుకున్న రవి

బిగ్ బాస్ గేమ్ చెప్పిన వెంటనే హౌస్ మేట్స్ తమ ప్లాన్లు వేసుకోవడం మొదలుపెట్టారు. హీరోస్ టీమ్‌లో ఉన్న షణ్ముఖ్ తన టీమ్‌తో డిస్కస్ చేస్తూ.. 'వాళ్లకు ఫిజికల్ టాస్క్ ఇస్తే చేస్తారు.. ఎమోషనల్ ఇవ్వాలి' అని చెప్పాడు. ఆ తరువాత విలన్స్ గ్రూప్ లో రవి.. 'యానీ మాస్టర్ నాకు తెలిసి ఫస్ట్ టార్గెట్ మీరుంటారు. డోంట్ సే ఐ క్విట్.. టాస్క్ అయ్యేంతవరకు చేయండి' అని చెప్పాడు. ఆ తరువాత విశ్వ-ప్రియాంక తలపడుతూ కనిపించారు. దీంతో ప్రియాంక ఫైర్ అయింది. వెంటనే సీన్ లోకి వచ్చిన రవి.. ప్రియాంకతో వాగ్వాదానికి దిగాడు. విశ్వ మొదటి నుంచి ప్రియాంకను కావాలని టార్గెట్ చేస్తున్నాడని డిస్కస్ చేశారు. హీరోస్‌ టీమ్‌ని ఇబ్బంది పెట్టేందుకు సన్నీ ఓ ప్లాన్ వేశాడు. ఇందులో హీరోస్‌ టీమ్‌ నుంచి శ్రీరామ్‌ వచ్చాడు. అతనికి జ్యూస్‌ తాగించి, డిప్స్ కొట్టించి, కుప్పిగంతులేయించారు. తలపై రంగు పోశారు. చివరిగా జుట్టు కట్‌ చేయాలని ప్రయత్నించారు. దీంతో టాస్క్ కంప్లీట్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ ఆదేశాల వరకు ఉండటంతో హీరోస్‌ టీమ్‌కి ఓ పాయింట్‌ వచ్చింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: సిరి, పింకీలను ముద్దు అడిగిన జెస్సీ.. వారియర్ అనిపించుకున్న రవి

తర్వాతి రౌండ్‌లో హీరోలు.. విలన్స్‌ టీమ్‌లోని రవిని టార్గెట్‌ చేశారు. రవి తన బట్టలన్నింటికీ పేడ అంటించాలని చెప్పాడు షణ్ను. కానీ జాలేసి కేవలం బట్టలకు వరకు పేడ అంటిస్తే సరిపోతుందన్నారు. ఆ తర్వాత అన్ని మిక్స్‌ చేసిన జ్యూస్‌ను తాగాలని షణ్ను చెప్పారు. ఆ వెంటనే స్క్వాడ్స్‌ చేయాలన్నారు. అయితే రవి దేనికీ భయపడకుండా తన వెన్నునొప్పిని సైతం పక్కనపెట్టి వీటన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశాడు రవి. మళ్లీ జ్యూస్‌ ఇవ్వగా దాన్ని కూడా తాగేసి షాకిచ్చాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.