close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీని కత్తులతో కసితీరా పొడిచిన కంటెస్టెంట్స్.. కెప్టెన్‌గా శ్రీరామ్

Friday, October 1, 2021 • తెలుగు Comments

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీని కత్తులతో కసితీరా పొడిచిన కంటెస్టెంట్స్.. కెప్టెన్‌గా శ్రీరామ్

బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్లు హోరాహోరీగా తలపడ్డారు. అలాగే ఎప్పుడూ లేని విధంగా సరికొత్త టాస్క్‌తో దీనికి మరింత ఆజ్యం పోశాడు బిగ్‌బాస్. అయతే ఇంటి సభ్యుల మద్ధతుతో శ్రీరామచంద్ర కెప్టెన్‌గా గెలిచాడు. మరి ఈ సందర్బంగా హౌస్‌లో ఏం చోటు చేసుకుందో తెలియాలంటూ ఈ రోజు ఎపిసోడ్‌లోకి వెళ్లాల్సిందే.

‘గెలవాలంటే తగ్గాల్సిందే’ టాస్క్ ఈ రోజు (గురువారం) ఎపిసోడ్‌లో కూడా కొనసాగింది. పవర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యానీ, స్వేతాలు.. షన్ముఖ్ సిరిని టాస్క్‌కు ఎంపిక చేసుకున్నారు. ‘చిక్కుల్లో చిక్కుకోకు’ టాస్క్ ఇచ్చారు. ఆరు తాళాల్లో చిక్కులు విడదీసి.. తాడు రంగు గల హుక్కులో పెట్టినవారు విజేతలుగా నిలుస్తారని బిగ్ బాస్ తెలిపాడు. గార్డెన్‌లో జరిగిన పోటీలో.. శ్వేత, యానీ మాస్టర్ త్వరగా టాస్క్ పూర్తి చేసి విజేతలుగా నిలిచారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీని కత్తులతో కసితీరా పొడిచిన కంటెస్టెంట్స్.. కెప్టెన్‌గా శ్రీరామ్

మానస్ రెండు రోజుల్లో 6 కిలోలు, సన్నీ 3 కిలోల బరువు తగ్గి టాస్క్‌లో కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించారు. ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ టాస్క్ పూర్తి కావడంతో బిగ్ బాస్.. పిజ్జా, కూల్ డ్రింక్‌తో హౌస్‌మెట్స్‌కి ట్రీట్ ఇచ్చాడు. అనంతరం.. అందరికన్నా ఎక్కువ బరువు కోల్పోయిన మూడు జంటల వివరాలను బిగ్ బాస్ అడిగాడు. సన్నీ-మానస్ ఫస్ట్, శ్రీరామ చంద్ర-హమీదా సెకండ్, యానీ మాస్టర్-స్వేత థర్డ్ ప్లేస్‌లో ఉన్నారని సంచాలకురాలు కాజల్ తెలిపింది. ఆ జంటల్లో ఎవరు కెప్టెన్‌గా ఉండాలనే విషయంపై వారిలో వారు మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలని బిగ్ బాస్ ఫిటింగ్ పెట్టాడు. దీంతో జంటలు చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. చివరికి శ్వేత, శ్రీరామచంద్ర, సన్నీలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికయ్యారు.

దీంతో ‘కత్తులతో సహవాసం’ టాస్క్‌ ద్వారా కెప్టెన్ ఎన్నిక చేసే బాధ్యతను ఇంట్లోవారికే బిగ్‌బాస్ అప్పగించాడు. ఎవరైతే అనర్హులో వారిని కత్తితో పొడిచి కెప్టెన్ కాకుండా చేయాలని.. బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ క్రమంలో కెప్టెన్‌ తర్వాత ముఖ్యమైన పోస్ట్‌ ఏంటని శ్రీరామ్‌ ప్రశ్నించగా హమీదా రేషన్‌ మేనేజర్‌ అని చెప్పింది. తనకు రేషన్‌ మేనేజర్‌ ఇష్టం లేదన్న శ్రీరామ్‌ తను గెలిస్తే హమీదాకు ఆ పోస్ట్‌ ఇప్పిస్తానన్నాడు. ఏ కారణం లేకపోయినా తనను నామినేట్‌ చేస్తున్నారని, కెప్టెన్‌ అయితే ఒకవారం ఇమ్యూనిటీ వస్తుందని ఆశపడ్డాడు. ఎలాగో సన్నీ పోటీలో నిలబడ్డా అతడికి ఎవరూ సపోర్ట్‌ చేయరని చెప్పాడు. అనంతరం శ్రీరామచంద్ర, శ్వేత, సన్నీ 'కత్తులతో సావాసం' అనే కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొన్నారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీని కత్తులతో కసితీరా పొడిచిన కంటెస్టెంట్స్.. కెప్టెన్‌గా శ్రీరామ్

టాస్కులో విశ్వ మాట్లాడుతూ.. కెప్టెనుగా లేనప్పుడు కూడా ఇంటి పనులను బాధ్యతగా తీసుకుని ఉంటే బాగుండేదని చెబుతూ సన్నీని కత్తితో పొడించాడు. షన్ను మాట్లాడుతూ.. కెప్టెన్సీకి నువ్వు అర్హుడవి కావంటూ సన్నీని పొడిచాడు. ముగ్గురు నాకు స్నేహితులే అంటూనే.. సన్నీ ఆర్టిఫిషియల్‌గా నవ్వుతూ ఫేక్‌గా ఉంటున్నాడని, చిక్కుల టాస్కులో కాజల్ తమని సపోర్ట్ చేస్తున్నట్లుగా కామెంట్ చేయడం బాగోలేదని తెలుపుతూ సన్నీని పొడిచింది. లోబో మాట్లాడుతూ.. నీకు ఆ టైము రాలేదు.. నువ్వు లాస్ట్ వరకు ఉంటావు.. అప్పుడు కెప్టెన్ అవుతావని చెబుతూ సన్నీని పొడిచాడు. టాస్కులో చిత్తశుద్ధిగా లేవని, బిర్యానీ తిన్నావంటూ హమీదా.. స్వేతను పొడించింది. అనంతరం ప్రియా కూడా సన్నీనే పొడిచింది. కెప్టెన్సీలో శ్రీరామ్, శ్వేతకు ఛాన్స్ ఇవ్వాలంటూ నటరాజ్.. సన్నీని పొడిచాడు. యానీ మాస్టర్ శ్రీరామ్‌ను, రవి.. సన్నీని పొడిచాడు. త్వరగా ఆవేశానికి గురవ్వుతారంటూ ప్రియాంక.. సన్నీని పొడిచింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీని కత్తులతో కసితీరా పొడిచిన కంటెస్టెంట్స్.. కెప్టెన్‌గా శ్రీరామ్

నేను కెప్టెన్‌ డ్రెస్‌ తెచ్చుకున్నానని, అది వేసుకోవడానికైనా తనను గెలిపించాలని సన్నీ అందరినీ రిక్వెస్ట్ చేశాడు. శ్రీరామ్‌ మాత్రం.. మీకు ఎవరు కరెక్ట్‌ అనిపిస్తే వారికే ఓటేయండని ప్రచారం నిర్వహించాడు. శ్వేత మాట్లాడుతూ.. తను కెప్టెన్‌ అయితే హౌస్‌ స్ట్రిక్ట్‌గా మారుతుందని హెచ్చరిక వదిలింది. ఇక శ్రీరామ్‌.. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తను సాల్వ్‌ చేస్తానని చెప్పాడు. సన్నీ.. అందరూ తనకు సమానమే అని, హౌస్‌లో పక్షపాతంగా వ్యవహరించనని ప్రామిస్‌ చేశాడు

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీని కత్తులతో కసితీరా పొడిచిన కంటెస్టెంట్స్.. కెప్టెన్‌గా శ్రీరామ్

అంతా కత్తులతో పొడవడంతో సన్నీ బాధపట్టాడు. మానస్ మాట్లాడుతూ.. తనని ఇంప్రస్ చేసేవారిని పొడవనని చెప్పాడు. చివరికి శ్వేతను పొడిచాడు. ఆ తర్వాత కాజల్ మాట్లాడుతూ.. తర్వాతి కెప్టెన్సీలో నీకు సపోర్ట్ చేస్తానంటూ శ్వేతను పొడిచింది. జెస్సీ శ్రీరామ్‌ను పొడిచాడు. చివరికి శ్రీరామ్‌ను తక్కువమంది పొడవడంతో అతను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. శ్వేత, జెస్సీలతో సన్నీ మాట్లాడుతూ.. ‘‘కాజల్ ముందు నన్ను పొడుస్తానని చెప్పి.. గేమ్ ఛేంజ్ కోసం నిన్ను పొడిచింది. మానస్ కూడా ఒపీనియన్ ఛేంజ్ చేసుకున్నాడు’’ అని తెలిపాడు. అయితే, కెప్టెన్సీని త్యాగం చేసిన తన పార్టనర్ మానస్ గురించి శ్వేతతో సన్నీ అలా మాట్లాడటం.. కాస్త ఆశ్చర్యకరమైన విషయమే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz