close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియా సేఫ్... బలైన లహరి, షణ్నూకి క్లాస్.. కెమెరాలున్నాయంటూ రవికి సజేషన్

Monday, September 27, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియా సేఫ్... బలైన లహరి, షణ్నూకి క్లాస్.. కెమెరాలున్నాయంటూ రవికి సజేషన్

బిగ్‌ బాస్ హౌస్ విజయవంతంగా మూడో వారాన్ని పూర్తి చేసుకుంది. ఇక ఓటింగ్‌లో తక్కువ ఓట్లు పడటంతో ఇంటి నుంచి లహరి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ వారం నామినేషన్స్ సందర్భంగా ప్రియ, రవి, లహరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా ప్రియ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఇలాంటి పరిస్ధితుల్లో నామినేషన్స్‌లో వున్న వాళ్లు ఎవరు ఎలిమినేట్ అవుతారన్న ఆసక్తి చివరి నిమిషం వరకు కొనసాగింది. ఇక సరయు, ఉమాదేవిలాగానే హౌస్ నుంచి వెళుతూ వెళుతూ... కంటెస్టెంట్‌లకు క్లాస్ పీకింది లహరి... మరి ఈ ఎపిసోడ్ ఎలా జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.

సండేను ఫండే చేసేందుకు నాగార్జున అందరితో ఫన్ చేశారు. ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టి వారితో ఆటలు ఆడించారు. ఇరు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరు వచ్చినప్పుడు పాట ప్లే చేస్తారు. వారిలో ముందుగా బజర్‌ నొక్కినవాళ్లు పాటలోని మిగతా చరణాలను పాడటంతోపాటు నచ్చినవాళ్లతో కలిసి డ్యాన్స్‌ చేయాల్సి ఉంటుంది. ముందుగా హమీదను చూస్తూ.. 'లుకింగ్ హాట్ బేబీ' అని నాగ్ అనగా.. 'టెల్ మి సమ్‌థింగ్‌ న్యూ' అంటూ నాగ్ కి ఫన్నీ రిప్లై ఇచ్చింది హమీద. గేమ్ మధ్యలో 'ఈ బాయ్స్‌ అండ్‌ గర్ల్స్‌ విడివిడి ఉండడం నచ్చడంలేదని' నాగ్‌ అంటే.. 'మాక్కూడా ఇష్టంలేదు' అంటూ సిరి సెటైర్‌ వేసింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియా సేఫ్... బలైన లహరి, షణ్నూకి క్లాస్.. కెమెరాలున్నాయంటూ రవికి సజేషన్

ఆ తరువాత నాగార్జున ఇచ్చిన టాస్క్ కి.. సిరి-శ్రీరామ్ కలిసి 'బుట్టబొమ్మ' సాంగ్ కి డాన్స్ చేశారు. జెస్సీ-హమీద కలిసి 'చిట్టి నీ నవ్వంటే' సాంగ్ కి డాన్స్ చేశారు. విశ్వ-యానీ మాస్టర్ కలిసి 'ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ ఫీలింగ్' సాంగ్ కి డాన్స్ చేశారు. ప్రియాంక-మానస్ కలిసి 'జిలేలమ్మ జిట్టా' సాంగ్ కి పెర్ఫార్మ్ చేశారు. కాజల్.. షణ్ముఖ్ తో కలిసి 'నీ కన్ను నీలి సముద్రం' సాంగ్ కి డాన్స్ చేసింది. ఆ తరువాత షణ్ముఖ్-నటరాజ్ కలిసి 'ఓ మై గాడ్ డాడీ' సాంగ్ కి డాన్స్ చేశారు. నటరాజ్-యానీ మాస్టర్ 'ప్రియరాగాలే' అనే రొమాంటిక్ సాంగ్ కి మాస్ స్టెప్స్ వేశారు. ఆ వెంటనే ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న ఐదుగురిలో నిన్నటి ఎపిసోడ్ లో శ్రీరామ్, ప్రియాంకలను సేవ్ చేశారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ముందుగా మానస్ ను సేవ్ చేసి.. ప్రియా-లహరి డేంజర్ జోన్ లో ఉన్నట్లు చెప్పారు.

అనంతరం ఇంటిసభ్యులతో కళ్లకు గంతలు కట్టి మరో గేమ్‌ ఆడించారు. ఇది కూడా జంటలుగా ఆడాల్సి ఉంటుంది. ఒకరు అక్కడ బల్లపై ఉన్న వస్తువులను టచ్‌ చేసి దాని గురించి వివరిస్తే మిగతా వ్యక్తి అదేంటో చెప్పగలగాలి. సిరి, షణ్ను జంటగా వచ్చారు. కానీ సిరి ఎంత క్లూ ఇచ్చిన షణ్ను అక్కడున్నది ఆవాలని చెప్పలేకపోయాడు. ఆవాలు కూడా తెలీదు, కానీ రేషన్‌ మేనేజర్‌ అంటూ అతడి పరువు తీసేశాడు రవి. తర్వాత ప్రియ, లహరి రాగా.. ప్రియ క్లూ ఇవ్వడంతోనే పల్లీలు అని టపీమని చెప్పేసింది లహరి.

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియా సేఫ్... బలైన లహరి, షణ్నూకి క్లాస్.. కెమెరాలున్నాయంటూ రవికి సజేషన్

తర్వాత ప్రియాంక, శ్వేత వర్మ రాగా.. పింకీ సగ్గుబియ్యం గురించి హింట్‌ ఇవ్వగా శ్వేత కరెక్ట్‌గా గెస్‌ చేసింది. యానీ మాస్టర్‌, విశ్వ రాగా.. అక్కడున్న ఇంకును యానీ మాస్టరే గుర్తుకుపట్టలేకపోవడంతో విశ్వ ఏమీ గెస్‌ చేయలేకపోయాడు. గోరుచిక్కుడు కాయ గురించి నటరాజ్‌ మాస్టర్‌ క్లూ ఇచ్చినా మానస్‌ కనిపెట్టలేకపోయాడు. సీతాఫలం గురించి సన్నీ ఎన్ని హింట్లు ఇచ్చినా హమీదా గుర్తు పట్టలేకపోయింది. శ్రీరామచంద్ర టూత్‌పేస్ట్‌ను కనిపెట్టలేకపోయాడు. దాల్చిన చెక్క గురించి కాజల్‌ టచ్‌ చేసి క్లూ ఇవ్వడంతో రవి ఇట్టే కనిపెట్టాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియా సేఫ్... బలైన లహరి, షణ్నూకి క్లాస్.. కెమెరాలున్నాయంటూ రవికి సజేషన్

నామినేషన్స్ లో చివరివరకు ప్రియా-లహరిలను ఉంచి టెన్షన్ పెట్టారు నాగ్. స్టేజ్ పై ఉన్న నాగార్జున రెడ్ కలర్ లో ఉన్న రెండు టార్చ్ లైట్ లను పట్టుకున్నారు. వాటిపై లహరి, ప్రియాల పేర్లు రాసి ఉన్నాయి. ఎవరి టార్చ్ లైట్ అయితే గ్రీన్ కలర్ లోకి వస్తుందో వాళ్లు సేఫ్ అని చెప్పగా.. ప్రియా టార్చ్ లైట్ గ్రీన్ కలర్ లోకి వచ్చింది. దీంతో ఆమె సేఫ్ అయింది. అందరూ ఊహించినట్లుగానే ఈసారి లహరి ఎలిమినేట్ అయింది. దీంతో హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా షాకయ్యారు.

శ్వేతా.. లహరి పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. హౌస్ నుంచి స్టేజ్ పైకి వెళ్లే సమయంలో లహరి.. షణ్ముఖ్ తో 'ఒకరు చేశారని నామినేట్ చేయకూడదు.. ఇది నేను స్టేజ్ పై చెప్పను' అంటూ కామెంట్ చేసింది. లహరి హౌస్ నుంచి వెళ్లిపోయిన తరువాత ఆమె షణ్ముఖ్ తో చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదని.. సిరి.. రవితో చెప్పింది. 'అందరూ ఒకటే పాట పాడుతున్నారని.. అసలు మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నది కూడా తక్కువే' అంటూ షణ్ముఖ్ గురించి సిరి చెప్పింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియా సేఫ్... బలైన లహరి, షణ్నూకి క్లాస్.. కెమెరాలున్నాయంటూ రవికి సజేషన్

స్టేజ్ పైకి వెళ్లిన లహరి.. ముందుగా సిరిని ఉద్దేశిస్తూ ఆమెకి కొంచెం ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ ఉందని చెప్పింది. యానీ మాస్టర్ చాలా స్వీట్ అని కానీ.. ఆమెతో ఎక్కువ ట్రావెల్ చేయలేకపోయానని చెప్పింది. 'కెమెరాస్ చాలా ఉన్నాయ్.. బీ కేర్ ఫుల్ బ్రో' అంటూ రవిని ఉద్దేశిస్తూ చెప్పింది. 'నీ గురించి నువ్ ఆలోచించుకో' అని శ్రీరామ్ కి చెప్పింది. 'బీ స్ట్రాంగ్' అని విశ్వకి సలహా ఇచ్చింది. 'నీ ఈక్వేషన్ మారిపోయింది' అని లోబోని ఉద్దేశిస్తూ అంది. నటరాజ్ మాస్టర్ కి ఏం తెలియదని.. భోళా శంకరుడు అని కామెంట్ చేసింది. శ్వేతాని ఉద్దేశిస్తూ స్ట్రాంగ్ గా ఉండు అని చెప్పింది. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకో.. అంటూ కాజల్ కి సలహా ఇచ్చింది. సిరి వేసేసిందని నువ్ వేసేశావ్.. ఇదేంట్రా అని షణ్ముఖ్ ని ప్రశ్నించింది. తను వేసిందని నేను వేయలేదని.. నువ్ తప్పుగా ఆలోచిస్తున్నావు అంటూ లహరికి చెప్పాడు షణ్ముఖ్. జెస్సీ తమ్ముడు లాంటి వాడని చెప్పింది లహరి. సన్నీ షార్ప్ అని అనుకుంటాడు కానీ కాదని తన అభిప్రాయం చెప్పింది. మానస్ గురించి పూర్తిగా తెలుసుకునేలోపు బయటకు వచ్చేశానని తెలిపింది. ప్రియాంక చాలా స్వీట్ అని.. హమీద సూపర్ స్ట్రాంగ్ అని చెప్పింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.