close
Choose your channels

మహేష్ కి పుట్టిన రోజు గిఫ్ట్...

Friday, August 7, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేనెప్పుడూ నా అభిమానులను సంతోష పెట్టడానికే సినిమాలు తీస్తాను. నా గత చిత్రాలు (నేనొక్కడినే, ఆగడు) నా అభిమానులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాయి. అందుకు నా వైపు నుండి ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించండి..ఈ మాటలను సూపర్ స్టార్ మహేష్ ఇటీవల జరిగిన శ్రీమంతుడు` ఆడియో ఫంక్షన్ లో అన్నారు.

ఈసారి నా పుట్టిన రోజున(ఆగస్ట్ 9న) అభిమానులు నాకు పుట్టినరోజు కానుక ఇస్తారని భావిస్తున్నానని కూడా అన్నారు. అనుకున్నట్లే కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన శ్రీమంతుడు` సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. మహేష్ కి అభిమానులు, ప్రేక్షకులు శ్రీమంతుడు సినిమాని సక్సెస్ చేసి గిఫ్ట్ ఇచ్చారు. దీంతో సూపర్ స్టార్ మహేష్ చాలా సంతోషపడిపోతున్నాడు. నా జీవితంలో హ్యపీయెస్ట్ రోజుల్లో ఈరోజు ఒకటి. శ్రీమంతుడు సినిమాకి అందరి దగ్గర నుండి మంచి రెస్పాన్స్ వస్తోందంటూ సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని వ్యక్త పరిచాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.