పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిమనిషి!


Send us your feedback to audioarticles@vaarta.com


పశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తైంది. ఈ క్రమంలోనే హోరాహోరీ ప్రచారం కూడా సాగుతోంది. ఎలాగైనా ప్రస్తుతం సీఎం మమతా బెనర్జీ హవాను అడ్డుకునేందుకు బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఆమెను ఇరుకున పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థుల ఎంపికను కూడా ఆసక్తికరంగా చేసింది.
తాజాగా బీజేపీ అభ్యర్థి ఒకరు చర్చనీయాంశంగా మారారు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మరారు. ఆమె ఒక పని మనిషి కావడం గమనార్హం. ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేని ఒక పనిమనిషిని తమ అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి కలితా అనే మహిళను బీజేపీ బరిలోకి దింపింది. ఆమెను ఎంపిక చేయటంపై బీజేపీ అభ్యర్థులు సైతం ఒక్కసారిగా అవాక్కయ్యారు. కలితా పేదరికం కారణంగా చదువుకోలేదు.
రోజు గడవడం కోసం నాలుగిళ్లలో పని చేసుకుని జీవిస్తోంది. ఎలాంటి రాజకీయ అనుభవమూ లేదు. ఆమె భర్త పేరు సుబ్రతా మజ్హీ.. ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. నియోజకవర్గ ప్రజలు సైతం బీజేపీ అబ్యర్థి కలిత అనగానే ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఈ కలిత ఎవరు? అని చర్చ మొదలు పెట్టారు. ప్రస్తుతం కలిత నెల రోజుల పాటు పనికి సెలవు పెట్టి ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనే విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు. ‘ఆట ఆడదాం’ అంటూ దీదీ చేస్తున్న నినాదంపై.. ‘మోకాలి గాయంతో ఆట ఎలా ఆడతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరి ఈ కలిత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments