close
Choose your channels

అదే క‌నుక జ‌రిగితే క‌ళ్యాణ్ గారి ఇంటి ముందు ధ‌ర్నా చేస్తా - డైరెక్ట‌ర్ బాబీ

Friday, April 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...రెండో సినిమాకే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకున్న యంగ్ డైరెక్ట‌ర్ బాబీ. ప‌వ‌న్ క‌ళ్యాణ్ - కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా బాబీ తెర‌కెక్కించిన చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 8న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ బాబీ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం....

స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకి డైరెక్టర్ గా అవ‌కాశం ఎలా వ‌చ్చింది..?

నేను డైరెక్ట్ చేసిన ప‌వ‌ర్ సినిమా సెప్టెంబ‌ర్ లో రిలీజ్ అయ్యింది. న‌వంబ‌ర్ లో ప్రొడ్యూస‌ర్ శ‌ర‌త్ మ‌రార్ నుంచి ఫోన్ వ‌చ్చింది. ఆయ‌న క‌ళ్యాణ్ గారు క‌ల‌వమ‌న్నారు అని చెప్పారు. నాకు క‌ల లా అనిపించింది. క‌ళ్యాణ్ గారి ఫామ్ హౌస్ కి వెళ్లి క‌లిసాను. ఆయ‌న ఓ క‌థ అనుకుంటున్నాను అని క‌థ చెప్పారు. అంతా అయిపోయిన త‌ర్వాత ఈ సినిమాకి నువ్వే డైరెక్ట‌ర్ అన్నారు. నాకు ఏమీ అర్ధం కాలేదు. ఈ సినిమాకి నేను డైరెక్ట‌ర్ అని ఎనౌన్స్ చేసే వ‌ర‌కు న‌మ్మ‌లేక‌పోయాను. మీడియాలో వ‌చ్చిన త‌ర్వాత అప్పుడు నిజ‌మే క‌ళ్యాణ్ గారి సినిమా చేస్తున్నాను అనిపించింది.

క‌ళ్యాణ్ మీలో ఏం చూసి స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ గా ఎంచుకున్నారు..?

ఆయ‌న నాతో ఫ‌న్ ఎలిమెంట్స్ బాగా తీస్తావు. హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యాలా సీన్స్ బాగా తీస్తావ్ అన్నారు. బ‌హుశా అది న‌చ్చే న‌న్ను స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ గా ఎంచుకున్నార‌నుకుంటున్నాను.

స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ మీరే అని తెలిసిన త‌ర్వాత ఆ వార్త‌ను ఫ‌స్ట్ ఎవ‌రితో షేర్ చేసుకున్నారు..?

మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో ఫోన్ లో షేర్ చేసుకున్నాను. కానీ..డైరెక్ట్ గా క‌ల‌సి ఈ ఆనందాన్ని మాత్రం హీరో ర‌వితేజ గారితో పంచుకున్నాను. ఎందుకంటే ఆయ‌నే ప‌వ‌ర్ సినిమాతో నాకు డైరెక్ట‌ర్ గా అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న్ని ఓ బ్ర‌ద‌ర్ లా ఫీలవుతుంటాను.

మీరు రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్.. అలాంటిది మీకు కళ్యాణ్ గారు క‌థ చెప్పిన‌ప్పుడు ఏమ‌నిపించింది..?

క‌థ విన‌డానికి ముందు భ‌యం వేసింది. క‌థ విన్న త‌ర్వాత ఈ క‌థ‌లో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కి ఎక్క‌వు స్కోప్ ఉంద‌నిపించింది.

ఈ సినిమాకి స్టోరీ రైట‌రే కాదు...డైరెక్ట‌ర్ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణే అని...అంతా ఆయ‌నే చేసుకున్నారు అని ప్ర‌చారం జ‌రుగుతుంది. మీరేమంటారు..?

క‌ళ్యాణ్ గారు డైరెక్ట‌ర్ అవ్వ‌డం వ‌ల‌న అలాంటి ప్ర‌చారం జ‌రుగుతుంది అనుకుంటున్నాను. ఆయ‌న రైట‌ర్ గా నాకు హెల్ప్ చేసేవారు అంతే.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి మీరు నేర్చుకుంది ఏమిటి..?

రైట‌ర్ గా ఏది రాస్తే..అది తెర‌పై ఖ‌చ్చితంగా ఉండాలి అని నేర్చుకున్నాను. ఉదాహ‌ర‌ణకి చెప్పాలంటే...స్ర్కిప్ట్ లో వంద గుర్రాలు ఉంటాయి అని రాసుకుంటే...ఖ‌చ్చితంగా వంద గుర్రాలు ఉండాల్సిందే అంటారు. ఇంకా ఆయ‌నతో వ‌ర్క్ చేయ‌డం వ‌ల‌న నాలో స‌హ‌నం పెరిగింది.

స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ట్రైల‌ర్ లోనే క‌థ ఏమిటి అనేది చెప్పేసారు. రిస్క్ అనిపించ‌లేదా..?

స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ క‌థ ఏమిటి అనేది ఆడియోన్స్ కి తెలియాలి అని ట్రైల‌ర్ లో చూపించాం. ట్రైల‌ర్ ఇలా ఉండాలి అని క‌ళ్యాణ్ గారే చెప్పారు. నేను కూడా ట్రైల‌ర్ లో క‌థ చెప్పేస్తే ఎలా..అని అంద‌రూ ఆలోచించిన‌ట్టే నేను ఆలోచించాను. ఇదే విష‌యాన్ని క‌ళ్యాణ్ గార్కి చెప్పిన‌ప్పుడు ట్రైల‌ర్ లో క‌థ చెప్పేద్దాం...థియేట‌ర్ కి వ‌చ్చిన ఆడియోన్స్ కి కొత్త ట్విస్ట్ లు చూపిద్దాం అన్నారు. అందుక‌నే ట్రైల‌ర్ ను అలా రిలీజ్ చేసాం.

ట్రైల‌ర్ కి మీకు వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి..?

ట్రైల‌ర్ బాగుంది అని చాలా మంది చెప్పారు. కొంత మంది అయితే ట్రైల‌ర్ లో క‌థ చెప్పేసారు ఏమిటి అని అడిగారు. ఆత‌ర్వాత ఫ్యాన్సే ట్రైల‌ర్ లో క‌థ ఏమిటి అని చెప్పేసి మంచి ప‌ని చేసారు అన్నారు. ఈమ‌ధ్య చెన్నై వెళ్లిన‌ప్పుడు షాపింగ్ మాల్ లో కొంత మంది కామ‌న్ ఆడియ‌న్స్ కూడా ట్రైల‌ర్ బాగుంది అని చెప్పారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంది..?

లాస్ట్ ఇయ‌ర్ ఏప్రిల్ నుంచి జ‌న‌వ‌రి వ‌ర‌కు నెల‌లో ఐదు రోజులు ప‌దిరోజులు షూటింగ్ చేస్తూ ఎంజాయ్ చేసేవాళ్లం. జ‌న‌వ‌రిలో ఓరోజు క‌ళ్యాణ్ గారు ఏప్రిల్ లో సినిమా రిలీజ్ ఎందుకు ప్లాన్ చేయ‌కూడ‌దు అన్నారు. నాకు ఏప్రిల్ లో రిలీజ్ చేయ‌గ‌ల‌మా అని చిన్న భ‌యం. ఆరోజు నుంచి ఒక ఆదివారం లేదు. పండ‌గ లేదు టీమ్ అంతా వ‌ర్క్ చేస్తునే ఉన్నాం. మేజ‌ర్ పార్ట్ అంతా జ‌న‌వ‌రి నుంచే చేసాం. ఒక ఛాలెంజింగ్ గా అనిపించింది. మొత్తానికి అనుకున్న విధంగా ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఇక క‌ళ్యాణ్ గారితో వ‌ర్క్ చేయ‌డం గురించి చెప్పాలంటే ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం అంత ఈజీ కాదు. కానీ...ఆయ‌న్ని త‌ట్టుకుని వ‌ర్క్ చేస్తే ఆత‌ర్వాత ఆయ‌నిచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఎందుకంటే షూటింగ్ లో క‌ష్ట‌ప‌డిన త‌ర్వాత సాయంత్రం అయితే ఆయ‌న‌ ప్ర‌శంసించ‌డం వ‌ల‌న వ‌చ్చే బ‌లం అంతా ఇంతా కాదు. సాయంత్రం అయితే ఆయ‌న‌లో ప‌సిపిల్లాడిని చూస్తాం. క‌ల‌లో కూడా ఇంత త్వ‌ర‌గా క‌ళ్యాణ్ గారితో సినిమా చేస్తాను అనుకోలేదు.సో.. క‌ళ్యాణ్ గారితో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి మీరు అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్ ఏమిటి..?

నేను చిరంజీవి గారి వీరాభిమానిని. ఆయ‌న్ని చూస్తే నా నోట మాట రాదు. చిరంజీవి గారు సెట్ కి వ‌చ్చిన‌ప్పుడు కూడా అలా చూస్తుండిపోయాను. ఆత‌ర్వాత చిరంజీవి గార్ని క‌లిస్తే న‌న్ను హ‌గ్ చేసుకుని అభినందించారు. ఓరోజు క‌ళ్యాణ్ గారు నాతో చెప్పారు...బాబీ పెద్ద డైరెక్ట‌ర్ అవుతాడు. మీరు కూడా బాబీతో సినిమా చేయాలి అని అన్న‌య్య‌తో చెప్పాను అన్నారు. నా గురించి క‌ళ్యాణ్ గారు ఇలా చిరంజీవి గారితో చెప్పడం...ఈ విష‌యాన్ని స్వ‌యంగా క‌ళ్యాణ్ గారు నాకు చెప్ప‌డం ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని అనుభూతి. క‌ళ్యాణ్ గారి నుంచి నేను అందుకున్న బెస్ట్ కాంప్లీమెంట్ ఇదే.

మ‌రి..చిరంజీవి గారితో సినిమా చేస్తారా..?

చిరంజీవి గారు పిల‌వాలే కానీ...వెంట‌నే క‌థ రెడీ చేసేస్తాను (న‌వ్వుతూ..)

గ‌బ్బ‌ర్ సింగ్ - స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ పోలిక‌లు ఏమిటి..?

కేవ‌లం క్యారెక్ట‌ర్ మాత్ర‌మే గబ్బ‌ర్ సింగ్ లా ఉంటుంది. అలాగే అందులో క‌ళ్యాణ్ గారి ఎన‌ర్జి ఎలా ఉందో...ఇందులో కూడా అదే ఎన‌ర్జి ఉంటుంది. ఇది త‌ప్పా గ‌బ్బ‌ర్ సింగ్ తో ఎలాంటి పోలిక ఉండ‌దు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇక రెండు మూడు సినిమాలు మాత్ర‌మే చేస్తాను అన్నారు క‌దా...ఈ విష‌యం గురించి ఆయ‌న‌తో మాట్లాడారా..?

క‌ళ్యాణ్ గారు సినిమాలు చేయ‌డం మానేస్తారు అని నేను అనుకోవ‌డం లేదు. మేము ఆయ‌న్ని వ‌ద‌లం. క‌ళ్యాణ్ గారు సినిమాల్లో న‌టించ‌డం మానేయ‌డం జ‌రిగితే క‌ళ్యాణ్ గారి ఇంటి ముందు ధ‌ర్నా చేసే వాళ్ల‌లో నేనే ముందుంటాను.

క‌ళ్యాణ్ ష‌క‌ల‌క శంక‌ర్ ని కొట్టారని వార్త‌లు వ‌చ్చాయి. నిజ‌మేనా..?

ఆ వార్త‌ల్లో నిజం లేదు. అవ‌న్నీ పుకార్లు మాత్ర‌మే. అస‌లు ఇలాంటి వార్త‌లు ఎక్క‌డ నుంచి వ‌స్తాయో తెలియ‌దు.

ఈ సినిమా ఇంత ఆల‌స్యం అవ్వ‌డానికి కార‌ణం ఏమిటి..?

స్ర్కిప్ట్ కే ఎక్కువ టైమ్ ప‌ట్టింది. సంవ‌త్స‌రంన్న‌ర స్ర్కిప్ట్ పై వ‌ర్క్ చేసారు. నేను ఐదు నెల‌లు ఈ స్ర్కిప్ట్ పై వ‌ర్క్ చేసాను. అందుచేత ఆల‌స్యం అయ్యింది.

నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి...?

స‌ర్ధార్ రిలీజ్ త‌ర్వాత ఒక నెల రోజులు పాటు ఫ్యామిలీ తో స్పెండ్ చేయాల‌నుకుంటున్నాను. ఆత‌ర్వాతే నా నెక్ట్స్ మూవీ ఏమిట‌నేది ఆలోచిస్తాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.