close
Choose your channels

ఫ్యాన్స్ కి చిరు అందిస్తున్న దీపావళి గిఫ్ట్..!

Friday, October 28, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150. 9 సంవ‌త్స‌రాల గ్యాప్ త‌రువాత చిరంజీవి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఖైదీ నెం 150 పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ భారీ చిత్రాన్ని డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ భారీ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. చిరు పుట్టిన‌రోజు కానుక‌గా ఖైదీ నెం 150 టైటిల్ & ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ రిలీజ్ చేసారు.
ఇక ఇప్పుడు దీపావ‌ళి కానుక‌గా ఖైదీ నెం 150 చిరు లుక్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 29న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు చిరు లుక్ రిలీజ్ చేయ‌నున్నారు. చిరు లుక్ ను అంద‌రికి న‌చ్చేలా సూప‌ర్ గా డిజైన్ చేసార‌ని తెలిసింది. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.