close
Choose your channels

కరోనా నేపథ్యంలో ప్రాణాల మీదికి తెస్తున్న అష్టాచమ్మ, పేకాట!

Saturday, April 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా నేపథ్యంలో ప్రాణాల మీదికి తెస్తున్న అష్టాచమ్మ, పేకాట!

కరోనా వైరస్‌ ఎంత ప్రమాదకరంగా ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇటీవలే.. కరోనా మహమ్మారి ఎంత ప్రమాదమో ‘అష్టాచమ్మా’ ఆట ద్వారా మరోసారి నిరూపితమైంది. సూర్యాపేట జిల్లాలో ఓ మహిళ అష్టాచమ్మా ఆడటం ద్వారా 31 మందికి కరోనా సోకింది. తబ్లిగి జమాత్‌ మీటింగ్‌కు వెళ్లివచ్చినవారితో కాంటాక్ట్‌ అయిన ఓ మహిళ ద్వారా వీరందరికీ సోకినట్లు తేలింది. కరోనా సోకిందని తెలియని ఆమె.. లాక్‌డౌన్ వేళ టైమ్‌ పాస్‌ కోసం సమీపంలోని పలు ఇళ్లలో తిరిగుతూ అష్టా చమ్మా ఆడింది. దీంతో ఆమె కాంటాక్ట్‌ అయినవారిలో చాలా మందికి కరోనా సోకింది. ఇది కూడా జిల్లాలో పెద్ద ఎత్తున కేసుల పెరుగుదలకు ఒక​ కారణం అయింది. ఈ ఘటనతో తెలంగాణ అధికార యంత్రాంగం అలెర్ట్ అయ్యింది.

పేకాట ద్వారా 17 మందికి..

ఇవాళ పేకాట ద్వారా ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో విజయవాడలో ఒకే వ్యక్తి ద్వారా 17 మందికి కరోనా సోకినట్టు అధికారులు తేల్చారు. విజయవాడలోని కృష్ణలంకలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం సంగతి తెలిసిందే. వారిలోని 17 మందికి ఒకే వ్యక్తి ద్వారా కరోనా సోకినట్టు తేలింది. కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్యగారి వీధిలో ఉండే ఓ లారీ డ్రైవర్... కొద్దిరోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లొచ్చాడు. అయితే మొదట్లో అతడితో కరోనా లక్షణాలు కనిపించడం లేదు. ఆ తర్వాత ఇరుగుపొరుగున ఉన్న వారితో పేకాట ఆడాడు.. తీరా ఆయనకు లక్షణాలుండటంతో టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడితో పేకాట ఆడిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోగా మొత్తం 17 మందికి కరోనా వచ్చినట్టు తేలింది. ఈ ఘటనతో అధికారులు షాకయ్యారు. దీంతో కృష్ణలంకలోని గుర్రాల రాఘవయ్యగారి వీధిని పూర్తిగా మూసేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబసభ్యులు కూడా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

తస్మాత్ జాగ్రత్త..

లాక్‌డౌన్‌తో ఎవరి ఇళ్లలో వారు ఉండటం ఎంతైనా మంచిది.. టైమ్ పాస్ కాకుంటే ఎన్నో పనులు చేసి సమయం గడిపేయచ్చు. ఇకనైనా నిర్లక్ష్యం వదిలి ప్రాణాల మీదికి తెచ్చుకోకుండా బాధ్యతగా వ్యవహరిస్తే మన ఆరోగ్యం మనచేతిలో ఉన్నట్లే.. అని నిపుణులు, ప్రభుత్వాలు చెబుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.