close
Choose your channels

తండ్రి పాత్ర‌లో క్రేజీ హీరో...

Tuesday, February 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తండ్రి పాత్ర‌లో క్రేజీ హీరో...

రీసెంట్ టైంలో వ‌రుస విజ‌యాల‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ హీరో త‌దుప‌రి కె.ఎస్‌.రామారావు నిర్మాణంలో క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ 8 ఏళ్ల కుర్రాడికి తండ్రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం.

స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్న తొలినాళ్ల‌లో బ్యాచిల‌ర్ హీరో.. తండ్రి పాత్ర‌లో న‌టించ‌డం అంటే గొప్పే క‌దా మ‌రి. ఈ చిత్రంలో విజ‌య్ స‌ర‌స‌న క్యాథ‌రిన్‌, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ 'డియర్ కామేడ్ర్' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.