close
Choose your channels

దివి హౌస్ నుంచి అవుట్.. సమంత హోస్టింగ్ ఎలా ఉందంటే..

Monday, October 26, 2020 • తెలుగు Comments

దివి హౌస్ నుంచి అవుట్.. సమంత హోస్టింగ్ ఎలా ఉందంటే..

ఇవాళ అక్కినేని వారి కోడలు సమంత షోని హోస్ట్ చేసింది. ఫస్ట్ టైమ్ చేసినప్పటికీ హౌస్‌మేట్స్‌ని ఓ ఆటాడేసుకుంది. బిగ్‌బాస్ షో స్టార్టింగ్‌లోనే తాను కులుమనాలిలో ఉన్నానని హోస్ట్ నాగార్జున చెప్పారు. తను లేనప్పుడు తన ఇల్లు అదే బిగ్‌బాస్ హౌస్‌ని కోడలు పిల్ల సమంతకు అప్పజెప్తున్నానని నాగ్ చెప్పారు. ఇక సామ్ ప్రోమో..ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ‘ఎంత సక్కగున్నవే..’ సాంగ్‌తో సమంత ఎంట్రీ ఇచ్చింది. తరువాత నాగ్, సామ్‌ల కాన్వర్సేషన్. నాగ్ తన స్థానంలో సామ్‌ హోస్ట్ చేస్తుందని హౌస్‌మేట్స్‌కి చెప్పారు.

దివి హౌస్ నుంచి అవుట్.. సమంత హోస్టింగ్ ఎలా ఉందంటే..

సామ్‌ను చూడగానే హౌస్‌మేట్స్ అంతా చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఇక సామ్.. అరియానాతో మొదలు పెట్టింది. అరియానా చాలా స్ట్రాంగ్ అని చెప్పిన సామ్... దివి.. అందమైన అమ్మాయని.. కానీ ఎందుకు టాస్క్‌ల్లో పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదని అడిగింది. తరువాత మోనాల్‌ని ఒకసారి ఏడిస్తే ఓకే కానీ.. అదే పనిగా ఏడుస్తూ ఉంటే బాగుండదని చెప్పింది. ఆ తరువాత లాస్య.. చక్కగా నవ్వుతావు.. గాసిప్ క్వీన్ అంటూ ఫన్నీగా సామ్ చెప్పింది. ఆ తరువాత మేల్ కంటెస్టెంట్లను.. స్ట్రెంత్, వీక్‌నెస్‌లను అడిగింది.

దివి హౌస్ నుంచి అవుట్.. సమంత హోస్టింగ్ ఎలా ఉందంటే..

ఇక సన్‌డే ఫన్‌డేలో భాగంగా.. సామ్ హౌస్‌లో స్వయంవరం నిర్వహించింది. మొదటగా అభి.. వెళ్లి అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలి. ఓ పాట పాడి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు కానీ వర్కవుట్ అవలేదు. అవినాష్ ఒకరకంగా కామెడీతోనే ఇంప్రెస్ చేయడానికే ట్రై చేశాడు. సొహైల్, మెహబూబ్ కండలు చూపించి ట్రై చేశారు. అఖిల్ ఓ పాట పాడి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. వీరిలో అమ్మాయిలు అఖిల్‌ను ఎంచుకున్నారు. దీంతో అఖిల్‌కి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ వీడియోను చూపించారు. ఆ తరువాత అఖిల్ చెప్పిన వాళ్లకు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ వీడియోను చూపించే అవకాశాన్ని సామ్ ఇచ్చింది. దీంతో అఖిల్.. మోనాల్ పేరు చెప్పాడు. మోనాల్ వీడియో చూసిన తరువాత.. ఆమెకు కూడా ఒకరిని సెలక్ట్ చేసే అవకాశం ఇవ్వడంతో నోయెల్ తన ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాడని తన పేరు చెప్పింది. నోయెల్ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన వీడియో చూపించి ఇంతటితో ఓవర్.. ముగ్గురికే అవకాశమని సామ్ చెప్పింది.

దివి హౌస్ నుంచి అవుట్.. సమంత హోస్టింగ్ ఎలా ఉందంటే..

నెక్ట్స్ అమ్మాయిల గురించి అడిగిన క్వశ్చన్స్‌కి హౌస్‌లోని అబ్బాయిలు ఆన్సర్ చేయాలి. ఈ రౌండ్‌లో కూడా అఖిల్ విన్ అయ్యాడు. ఈ రౌండ్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చెయ్యాలి అంటే అంతా అఖిల్ పేరు చెప్పారు. కానీ రెండు రౌండ్స్ విన్ అయినవారిని ఎలిమినేట్ చేస్తారా? అని సామ్ అడగడంతో ఒక్క పాయింట్ కూడా తెచ్చుకోని సొహైల్‌ని ఎలిమినేట్ చేశారు. దీంతో సామ్ సొహైల్‌కి వాళ్ల ఫ్యామిలి మెంబర్స్ వీడియో చూపించారు. తరువాత సొహైల్‌ని ఎవరినైనా సెలక్ట్ చేయమంటే అమ్మ రాజశేఖర్‌ని సెలక్ట్ చేశాడు. దీంతో అమ్మ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో చూపించారు. నెక్ట్స్ అమ్మ.. దివిని సెలక్ట్ చేశారు. దీంతో దివి వాళ్ల పేరెంట్స్ వీడియోను చూపించారు. అయితే మిగిలిన నలుగురి నుంచి ఒక్కొక్కరిని జోడిగా ఎంచుకోవాలి. అరియానా.. మెహబూబ్‌ని.. దివి.. అభిని.. మోనాల్.. అఖిల్‌ని.. హారిక.. అవినాష్‌ని ఎంచుకుంది.

దివి హౌస్ నుంచి అవుట్.. సమంత హోస్టింగ్ ఎలా ఉందంటే..

హీరో అఖిల్ ఎంట్రీ.. నాలుగు జోడీలు పెర్ఫామ్ చేసిన అనంతరం బెస్ట్ జోడిని సెలక్ట్ చేయాలి. దీంతో అఖిల్ మెహబూబ్, అరియానా జోడిని ఎంచుకున్నారు. వాళ్లకు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ వీడియో చూపించారు. తరువాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీజర్ చూపించారు. మొదటగా అరియానాను సామ్ సేఫ్ చేస్తే.. తరువాత వచ్చిన హీరో అఖిల్.. మోనాల్‌ను సేఫ్ చేశాడు. తరువాత మిగిలిన వారందరికీ వాళ్ల కుటుంబ సభ్యుల వీడియోలు చూపించారు. తరువాత హైపర్ ఆది, పాయల్ రాజ్‌పుత్ ఎంట్రీ ఇచ్చారు. పాయల్ వెంటనే వెళ్లిపోయింది. ఇక డిటెక్టివ్‌గా హైపర్ ఆది కంటెస్టెంట్ల గురించి చాలా ఫన్నీగా అద్భుతంగా చెప్పాడు. తరువాత అభిని సేఫ్ చేశారు. తరువాత అవినాష్ సేఫ్ అయ్యాడు. దివి ఎలిమినేట్ అయ్యింది. ఇక బిగ్‌బాంబ్.. వారమంతా ఒకరి అసిస్టెన్స్ తీసుకుని వంట చెయ్యాలి. బిగ్‌బాంబ్‌ని దివి.. లాస్యపై వేసింది. మొత్తమ్మీద సమంత.. నాగ్ లేని లోటును బాగానే కవర్ చేసింది.

Get Breaking News Alerts From IndiaGlitz