close
Choose your channels

CM Jagan:చంద్రబాబు మాటలు నమ్మకండి.. బాలయ్య అడ్డాలో సీఎం జగన్ పిలుపు..

Saturday, May 4, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ ఎన్నికల వేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై పెద్ద రాజకీయ దుమారం రేగుతోంది. ఈ చట్టంతో ప్రజల భూములు లొక్కొంటారని.. మీ భూమిని లిటిగేషన్‌లో ఇరుక్కుంటే కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా చట్టం తెచ్చారని కూటమి నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ చట్టంతో లబ్ధిదారుల పేర్లు మార్చి ఇష్టారీతిన పొలాలు, ఆస్తులు దోచుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ అంశం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై సీఎం జగన్ ప్రతి సభలోనూ వివరణ ఇస్తున్నారు.

హిందూపురంలో నిర్వహించిన వైసీపీ ఎన్నికల ప్రచార సభలోనూ సీఎం జగన్ ఈ చట్టం గురించి మాట్లాడారు. భూమి మీద సొంతదారుకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమని స్పష్టం చేశారు. మున్ముందు రోజుల్లో ఈ చట్టం ఒక గొప్ప సంస్కరణ అవుతుందన్నారు. భూ వివాదాల వల్ల ఇప్పటివరకు రైతులు, ప్రజలు, అధికారులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో అలాంటి సమస్య ఉండదని పేర్కొన్నారు. ఇప్పుడు చేస్తున్న సర్వే పూర్తయితే, భూములపై ఎలాంటి వివాదం ఉండబోదని ప్రభుత్వం హామీ ఇస్తుందని తెలిపారు.

మీ బిడ్డ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునే వాడు కాదని స్పష్టంచేశారు. ఈ చట్టం ద్వారా ఇచ్చే ల్యాండ్ టైటిల్‌కు బీమా కూడా ఉంటుందని వెల్లడించారు. ఇలా ఇచ్చే ల్యాండ్ టైటిల్స్‌కు ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎప్పుడో బ్రిటీష్ పాలన కాలంలో భూ సర్వే జరిగిందని ఇప్పుడు మీ బిడ్డ హయాంలో సమగ్ర భూ సర్వే జరుగుతోందని వివరించారు. భూములకు సరిహద్దు రాళ్లు వేస్తున్నామని, ఆ వివరాలను అప్ డేట్ చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17వేల రెవెన్యూ గ్రామాలు ఉంటే, 6 వేల గ్రామాల్లో సర్వే పూర్తయిందని వెల్లడించారు.

రానున్న రోజుల్లో మిగతా గ్రామాల్లోనూ సర్వే నిర్వహించి రైతులకు పదిలంగా హక్కు పత్రాలు అందిస్తామని తెలిపారు. దీనిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ మండపడ్డారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు ఇస్తారంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని ఖండించారు. దేశవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల విధానంలో కార్డ్ ప్రైమ్-2 సాఫ్ట్ వేర్ అమలు జరుగుతోందని.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి పూర్తిస్థాయి డాక్యుమెంట్లును సొంతదార్లకు అప్పగిస్తున్నామని వెల్లడించారు. పేదల బతుకులు బాగుపడాలన్నా. భవిష్యత్తు మారాలన్నా. లంచాలు లేని అవినీతిరహిత పాలన కొనసాగాలన్నా.. ఫ్యాన్‌ గుర్తుకే మళ్లీ ఓటేయాలని కోరారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Login to post comment
Cancel
Comment