close
Choose your channels

ఎగ్జిట్ పోల్స్ నిషేధించిన ఎన్నికల కమిషన్

Tuesday, October 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎగ్జిట్ పోల్స్ నిషేధించిన ఎన్నికల కమిషన్

ఈ నెల 21న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 21న రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్ 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఈసీ ఓ ప్రకటనలో తేల్చిచెప్పింది. అయితే రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఉప ఎన్నికలు జరుగనున్న 17 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధిస్తున్నట్లు భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కాగా.. ఎన్నికల కమిషన్ అధికార ప్రతినిధి ఎస్.శరణ్ ఈ మేరకు వివరాలను ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.