close
Choose your channels

4 ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈడు గోల్డ్ ఎహే ఆడియో రిలీజ్..!

Friday, September 16, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఈడు గోల్డ్ ఎహే.ఎ టివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఆడియో వేడుక‌ను వినూత్నంగా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలోని నాలుగు పాట‌ల‌ను నాలుగు ప్ర‌ధాన న‌గ‌రాల్లో రిలీజ్ చేయ‌నున్నారు. ఈనెల 21న హైద‌రాబాద్ లో ఫ‌స్ట్ సాంగ్, 22న వైజాగ్ లో సెకండ్ సాంగ్, 23న రాజ‌మండ్రిలో థ‌ర్డ్ సాంగ్, 24న విజ‌య‌వాడ‌లో ఫోర్త్ సాంగ్ రిలీజ్ చేయ‌నున్నారు. సునీల్‌ కెరీర్లో ఈడు గోల్డ్‌ ఎహే మరో సూపర్‌హిట్‌ చిత్రమవుతుంది అనే అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి...ఆ అంచ‌నాల‌ను సునీల్ ఎంత వ‌ర‌కు అందుకుంటాడో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.