close
Choose your channels

రాజ‘శేఖర్’ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

Saturday, February 6, 2021 • తెలుగు Comments

చాలా కాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన హీరో రాజశేఖర్ 2017లో ఎంట్రీ ఇచ్చి ‘గరుడవేగ, కల్కి’ వంటి సినిమాలతో మరోమారు తన స్టామినాను రుజువు చేసిన విషయం తెలిసిందే. గత గురువారం ఆయన పుట్టినరోజు సందర్భంగా తన నూతన చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ‘శేఖర్’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను మరికాసేపట్లో చిత్రబృందం విడుదల చేయనుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది. రాజశేఖర్ 92వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక థీమ్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.

రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నెరిసిన గడ్డంతో రాజశేఖర్ కనిపిస్తున్నారు. తన ఏజ్‌కు తగ్గట్టుగా మంచి కాన్సెప్టెడ్ స్క్రిప్ట్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా రాజశేఖర్ ఒక ఎమోషనల్ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ఆ పోస్టులో.. ‘‘ప్రియాతి ప్రియమైన నన్ను ప్రేమించే నా వాళ్లందరికీ.. నేను ప్రేమించే నా అభిమానులకి.. అతి భయంకరమైన కోవిడ్-19 నన్ను మరణపు సరిహద్దుల్లోకి తీసుకెళ్లినా.. మీ ప్రేమ, అభిమానం, మరియు నిరంతర ప్రార్థనలతో నన్ను మళ్లీ ఈ నా పుట్టినరోజు నాడు ఒక కొత్త సినిమా ప్రారంభించే స్థితికి తీసుకొచ్చాయి. కనిపించని దేవుడికి, కనిపించే దేవుళ్లైన మీకు సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను’’ అని రాజశేఖర్ తెలిపారు.

‘కల్కి’ తర్వాత మళ్లీ కొంత గ్యాప్ తరువాత ఈ చిత్రాన్ని రాజశేఖర్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా నేడు ప్రారంభమైంది. మలయాళంలో హిట్టయిన 'జోసెఫ్' అనే సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి లలిత్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మూలకథకు మార్పులు చేర్పులు చేశారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz