close
Choose your channels

హ్యాపీ బర్త్ డే టు రాకింగ్ స్టార్ మంచు మనోజ్

Friday, May 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ స్టైల్ లో నటనకు సరికొత్త నిర్వచనం చెప్పిన కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు తనయుడైన మంచు మనోజ్ మేజర్ చంద్రకాంత్, అడవిలో అన్న వంటి పలు చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించారు. 2004లో విడుదలైన దొంగ దొంగది చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశారు. అప్పటి నుండి ప్రతి సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో రాకింగ్ స్టార్ మంచు మనోజ్. తండ్రి తరహాలో ప్రయోగాలకు వెరవని నైజమే మనోజ్ ను తెలుగు చిత్రసీమలో హీరోగా నిలదొక్కుకునేలా చేసింది.

తొలి చిత్రం దొంగ దొంగది తర్వాత శ్రీ, రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, బిందాస్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, పాండవులు పాండవులు తుమ్మెద, కరెంట్ తీగ, శౌర్య, ఎటాక్ ఇలా ప్రతి చిత్రంలో విలక్షణమైన పాత్రను పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ బిందాస్ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు మూడు చిత్రాల్లో నటించనున్నారు. ఈ చిత్రాలు జూన్ నెలలో ప్రారంభం అవుతాయి. మనోజ్ హీరోగా సాగర్ ప్రసన్న దర్శకత్వంలో రూపొందనున్న సీతా మహాలక్ష్మి` (మద్రాస్ ర్యాంబో క్యాప్షన్) చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీని అందిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కె.సత్య దర్శకత్వంలో శ్రీ వరుణ్ అట్లూరి నిర్మించనున్న చిత్రంలో నటించనున్నారు. అలాగే ఎం.అచ్చిబాబు సమర్పణలో ఎస్.ఎన్.ఆర్.ఫిలింస్ ప్రై.లి., న్యూ ఎంపైర్ సెల్యూలాయిడ్స్ బ్యానర్స్ పై ఎస్.ఎన్.రెడ్డి, ఎన్.లక్ష్మీ కాంత్ నిర్మాతలుగా అజయ్ అండ్రూస్ నౌతాక్కి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి వి.కె.రామరాజు సినిమాటోగ్రఫీని అందిస్తుండగా కార్తీక శ్రీనివాస్ ఎడిటర్ గా వర్క్ చేయనున్నారు. గోపీమోహన్ రచయితగా పనిచేస్తున్నారు.

కొత్త సబ్జెక్ట్ లతో సినిమాలు చేస్తూ ఈ తరం యంగ్ హీరోస్ లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు మే 20. ఇలాంటి పుట్టినరోజులను ఆయన మరిన్ని జరుపుకుంటూ అభిమానులను, ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.