close
Choose your channels

YS Jagan: ఏపీ సీఎం జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..? దీని వెనక బీజేపీ పెద్దలు ఉన్నారా..?

Wednesday, November 8, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ సీఎం జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..? దీని వెనక బీజేపీ పెద్దలు ఉన్నారా..?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇటీవల వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణపై కోర్టు్ల్లో కదలిక మొదలైంది. 2012లో జైలు నుంచి విడుదలైన జగన్.. అప్పటి నుంచి బెయిల్‌పైనే బయట ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం విచారణకు హాజరయ్యేవారు. అయితే 2019లో ముఖ్యమంత్రి అయ్యాక వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు పొందిన సంగతి తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ జగన్‌పై నమోదైన కేసుల్లో సీబీఐ ఛార్జీషీట్లు నమోదుచేసినా సీబీఐ కోర్టులో విచారణ మాత్రం నత్తనడకన సాగుతుందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇదే జగన్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమే అనిపిస్తోందనే ప్రచారం ఊపందుకుంది.

సీజేఐకి పురుందేశ్వరి లేఖ..

జగన్‌తో పాటు ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం సంచలనంగా మారింది. పదేళ్లుగా బెయిల్‌పై కొనసాగుతూ సీబీఐ, ఈడీ కేసుల విషయంలో షరతులు ఉల్లంఘిస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఇప్పటికే 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని.. ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా పదే పదే వాయిదాలతో అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అందుకే తక్షణమే ఇద్దరి బెయిల్ రద్దు చేయాలని ఆమె సీజేఐని కోరారు.

ఏపీ సీఎం జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..? దీని వెనక బీజేపీ పెద్దలు ఉన్నారా..?

సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు..

ఇక అక్రమాస్తుల కేసుల విచారణపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులోనూ జగన్‌కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ ఆలస్యానికి కారణాలేంటో చెప్పాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అలాగే రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.

జగన్‌కు టీఎస్ హైకోర్టు నోటీసులు..

ఇవి ఇలా ఉంటే తాజాగా తెలంగాణ హైకోర్టులోనూ జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే ఆయన పిటిషన్‌ను పిల్‌(ప్రజా ప్రయోజన వ్యాజ్యం)గా స్వీకరించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. ఈ అభ్యంతరాలపై విచారణ జరిపిన జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్ ధర్మాసనం పిటిషన్‌ను పిల్‌గా మార్చేందుకు అంగీకరించింది. పిల్‌కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం జగన్‌, సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు జారీ చేసింది.

ఏపీ సీఎం జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా..? దీని వెనక బీజేపీ పెద్దలు ఉన్నారా..?

బెయిల్ రద్దు దిశగా పరిణామాలు..?

ఈ పరిణామాలన్నింటిని గమనిస్తే అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు దిశగా ప్రయత్నాలు ప్రారంభమైనట్లు సంకేతాలు కనపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగన్నరేళ్లుగా సైలెంట్‌గా ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ.. బెయిల్ అంశం.. ఇప్పుడు ఆకస్మాత్తుగా తెరపైకి రావడం వెనక పెద్ద ప్లానే ఉందని భావిస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వరి లేఖ రాయడం వెనక బీజేపీ పెద్దలు ఉన్నారనే అనుమానాలు వస్తున్నాయంటున్నారు. పెద్దలు మద్దతు లేకుండా ఓ రాష్ట్ర అధ్యక్షురాలు సీజేఐకి ఇలా లేఖ రాయడం అసంభవం అని వాదిస్తున్నారు. ఎన్నికల ముందు కచ్చితంగా జగన్ బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos