close
Choose your channels

ఎన్టీఆర్ ఆలోచన అదేనా...

Monday, May 16, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రం జనతా గ్యారేజ్. సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్టులో విడుదల చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మే 19 సాయంత్రం, టీజర్ మే 28న విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాతో ఎన్టీఆర్ తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నాన్నకు ప్రేమతో చిత్రంతో ఓవర్ సీస్ లో తన మార్కెట్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో దాన్ని మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాడు. అందులో భాగంగా న్యూ జెర్సీలో ఆడియో వేడుకును నిర్వహించాలనుకుంటున్నాడు. అలాగే కేరళలో కూడా ఈ సినిమా ఈవెంట్ నిర్వహించి అక్కడ కూడా పాగా వేయాలనుకుంటున్నాడు. తెలుగులోనే కాకుండా మలయాళం, ఓవర్ సీస్ లో తన సత్తా చాటేందుకు ఎన్టీఆర్ ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.