close
Choose your channels

బాలీవుడ్‌కి వెళుతున్న 'జెర్సీ'

Tuesday, June 25, 2019 • తెలుగు Comments

బాలీవుడ్‌కి వెళుతున్న జెర్సీ

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా రూపొందిన చిత్రం `జెర్సీ`. గౌత‌మ్ తిన్న‌నూరి దర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొందింది. ఈ ఏడాది విడులైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఈ సినిమా హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాడ‌ని టాక్‌. అయితే బాలీవుడ్ రీమేక్‌లో ఎవ‌రు న‌టిస్తారు, ఎవ‌రు డైరెక్ట్ చేస్తార‌నే దానిపై క్లారిటీ లేదు.

తెలుగులో రూపొందుతోన్న విభిన్న‌మైన చిత్రాల‌కు ఇత‌ర భాష‌ల్లో ఇప్పుడు మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. అందుక‌నే రీమేక్ రైట్స్ కోసం మంచి పోటీ ఏర్ప‌డుతుంది. రీమేక్ చిత్రాల‌కు కూడా మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. రీసెంట్‌గా తెలుగు నుండి హిందీలోకి రీమేక్ అయిన `క‌బీర్‌సింగ్‌` ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. ఇప్పుడు అడే స్టైల్లో `జెర్సీ` ఎలాంటి ఆద‌ర‌ణ‌ను పొందుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz