close
Choose your channels

ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.. ‘కల్కి’ ట్రైలర్ రివ్యూ

Thursday, May 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి.. ‘కల్కి’ ట్రైలర్ రివ్యూ

యాంగ్రీ స్టార్ రాజశేఖర్‌, ఆదాశర్మ, నందిత శ్వేత నటీనటులుగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి’. ఈ చిత్ర ట్రైలర్‌ను నేచురల్‌స్టార్‌ నాని ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. టీజర్ రిలీజ్ చేసిన కొన్ని గంటల్లో ఊహించని వ్యూస్ వచ్చాయి. ‘పార్ధా.. కర్మలను ఆచరించుటయెందే నీకు అధికారము కలదు కానీ వాటి ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణం కారాదు. అలాగని కర్మలు చేయుట మానరాదు’ అంటూ ఓ సాధువు రాజశేఖర్‌తో చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది. ఈ మాటలు విన్న రాజశేఖర్.. ‘ఏం సెప్తిరి ఏం సెప్తిరి. ఎప్పుడూ ఇలాగే సెప్తారా..’ అని వెటకారంగా అనడం నవ్వులు పూయిస్తోంది.

‘కల్కి’ ట్రైలర్ రివ్యూ..

సాధువు, రాజశేఖర్ వేసిన డైలాగ్స్ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు యాంగ్రీస్టార్‌ను అభినందిస్తున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు నవ్వుకుంటూ వారెవ్వా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే డైలాగ్స్ కొన్ని వెటకారంగా ఉన్నాయని.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను వెక్కిరించినట్లు, హేలన చేసినట్లు ఉన్నాయని అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఏం చెప్తిరి ఏం చెప్తిరి’ అనే డైలాగ్ గబ్బర్ సింగ్‌తో ఎంత పాపులర్ అయ్యిందో కొత్తగా చెప్పనక్కర్లేదు.. అది ఇప్పటికీ ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. అదే డైలాగ్ ఇప్పుడు రాజశేఖర్ నోటి వెంట వచ్చిందని కొందరు పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సేమ్ సీన్ మళ్లీ గుర్తొచ్చింది..!

కాగా.. ఈ చిత్రంలో రాజశేఖర్‌ పోలీసు పాత్రలో మరోసారి నటిస్తుండటం విశేషం. సో.. మొత్తానికి చూస్తే.. తప్పులు చేసిన వాడు కర్మల నుంచి తప్పించుకోవడం అసాధ్యం అన్న కాన్సెప్ట్‌ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంతో యాంగ్రీస్టార్‌ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజ‌శేఖ‌ర్ డాన్సింగ్ అంటే ఓ ట్రేడ్ మార్క్ స్టెప్ ఒకటి ఉంటుంది. అది ఎన్నడూ మరిచిపోలేం.. అదే ‘రోస్.. రోస్ రోజా పువ్వా’ అనే పాటకు అలా రెండు చేతులూ, కాళ్లూ ఓ రిథ‌మ్‌ప్ర‌కారం ఊపితే రాజ‌శేఖ‌ర్ స్టెప్ వ‌చ్చేస్తుంది. ఇప్పుడు ఈ మూవీలో కూడా అదే స్టెప్ చూపించడంతో మళ్లీ అభిమానులు పాత రోజులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఈ సాంగ్‌ను రాజ‌శేఖ‌ర్‌ డూప్‌తో వేయించడం మరో కిక్కించే విషయమని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూస్తే రాజశేఖర్ ట్రైలర్‌లో కిరాక్ అనిపించాడని చెప్పుకోవచ్చు. అంతేకాదు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇరగదీశాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒరక్క మాటలో చెప్పాలంటే యాంగ్రీస్టార్ ‘కల్కి’తో వండర్ చేయబోతున్నాడని అర్థం చేసుకోవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.