close
Choose your channels

'కాటమరాయుడు' లీక్....

Wednesday, March 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తోన్న చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌మిళ చిత్రం వీరం మెయిన్ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మార్చి 24న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉండ‌గానే ఈ సినిమా క్లైమాక్స్ సీన్‌కు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో లీకైయ్యింద‌ట‌. పెద్ద పెద్ద చిత్రాల‌ను ప్ర‌స్తుతం ఇబ్బంది పెడుతున్న ఈ సినిమా లీకేలీల స‌మ‌స్య కాట‌మ‌రాయుడుకు త‌ప్ప‌లేదు. గ‌తంలో కూడా ప‌వ‌న్ అత్తారింటికి దారేది చిత్రం స‌గానికి పైగా లీకైంది. ఇప్పుడు కాట‌మ‌రాయుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో చూద్దాం...

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.