close
Choose your channels

కాటమరాయుడు పై కరెన్సీ ప్రభావం..!

Thursday, November 24, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌ధాని మోడీ 500, 1000 నోట్ల ర‌ద్దు చేసి 2000 నోటును రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. నోట్ల ర‌ద్దుతో ఈ క‌రెన్సీ ప్ర‌భావం కాట‌మ‌రాయుడు పై బాగా ప‌డింది. ఇటీవ‌ల బ్యాంక్ కి వెళ్లి పాత నోట్లును మార్చుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్ర‌స్తుతం ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ షూటింగ్ గ్యాప్ లో కాట‌మ‌రాయుడు 100 నోటుతో కొత్త‌గా మార్కెట్ లోకి వ‌చ్చిన 2000 నోటును కంపేర్ చేస్తూ ప‌వ‌ర్ ఫుల్ ఐస్ తో మార్పులు గ‌మ‌నిస్తున్నాడు.
ఇలా క్షుణ్ణంగా ప‌రిశీలించ‌డానికి ఓ కార‌ణం ఉంది. అది ఏమిటంటే....2000 నోటు మార్కెట్ లోకి వ‌చ్చిందో లేదో అప్పుడే దొంగ 2000 నోటుమార్కెట్ లోకి వ‌చ్చేసింది. దీంతో అస‌లు ఏదో...దొంగ నోటు ఏదో తెలుసుకోవ‌డం కాస్త క‌ష్టంగా ఉంది. ఈ విష‌యం తెలిసిందేమో షూటింగ్ గ్యాప్ లో కాట‌మ‌రాయుడు క‌రెన్సీ పై ఇలా.. ప‌వ‌ర్ ఫుల్ లుక్కేసాడు..! అది సంగ‌తి..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.