close
Choose your channels

నలుగురు టాప్ హీరోలతో కీర్తి ధమాకా

Thursday, January 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్.. అనతి కాలంలోనే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో టాప్ కథానాయికలలో ఒకరుగా ఎదిగారు. తెలుగులో రామ్ తో, తమిళంలో విక్రమ్ ప్రభుతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి...పవన్ కల్యాణ్, సూర్య, విజయ్, విక్రమ్ వంటి టాప్ హీరోల సరసన కథానాయికగా నటించే స్థాయికి ఎదిగింది కీర్తి. అలాగే వీరితో నటించే సినిమాలన్నీ ఈ ఏడాదిలోనే విడుదల కావడం మరో విశేషం. ప్రస్తుతం పవన్, సూర్యలతో చేసిన అజ్ఞాతవాసి`, గ్యాంగ్` సినిమాలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇక విక్రమ్, కీర్తి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సామి2` సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది. అలాగే తుపాకి`, కత్తి` వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో విజయ్ సరసన రెండోసారి నటించే అవకాశం దక్కించుకుంది కీర్తి. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో భైరవ` సినిమాలో ఈ జంట సందడి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి` సినిమాలో ప్రధాన పాత్రనే పోషిస్తోంది. ఈ సినిమా మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధ పడుతోంది. ఇలా ఈ సంవత్సరంలో ఐదు పెద్ద సినిమాలతో కనువిందు చేయనుంది ఈ మలయాళీ ముద్దు గుమ్మ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.