close
Choose your channels

ప్యాలెస్ లో మహేష్...

Monday, August 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `భ‌ర‌త్ అను నేను` షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శ్రీమంతుడు త‌ర్వాత ఈ హిట్ కాంబోలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో మ‌హేష్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. ఆగ‌స్ట్ 10 నుండి 22 వ‌ర‌కు లక్నోలో షెడ్యూల్ జ‌రగ‌నుంది.

ఈ షెడ్యూల్‌లో జ‌హీంగారాబాద్ ప్యాలెస్‌, న‌డ్వా క‌ళాశాల‌, ముసాభామ్ ప్యాలెస్‌ల‌లో చిత్రీక‌రిస్తార‌ట‌. ఈ షెడ్యూల్‌లో చిత్ర ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొంటుంది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. కైరా అద్వాణి ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.