close
Choose your channels

మహేష్ - కొరటాల మూవీ ప్రారంభం..!

Wednesday, November 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ మ‌హేష్ బాబు - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో శ్రీమంతుడు చిత్రం రూపొందిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రెండో చిత్రం ఈరోజు రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్నారు. ఈరోజు పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
ఈరోజు జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మంలో కొర‌టాల శివ‌, దేవిశ్రీప్ర‌సాద్, న‌మ్ర‌త‌, డి.వి.వి.దాన‌య్య‌, సురేష్ బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు. మ‌హేష్ బాబు ఈ ప్రారంభోత్స‌వానికి హాజ‌రు కాలేదు మ‌హేష్ భార్య న‌మ్ర‌త హాజ‌ర‌య్యారు. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఫైన‌ల్ చేయ‌లేదు. అయితే...ఈ చిత్రం ద్వారా కొత్త అమ్మాయిని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. జ‌న‌వ‌రి నుంచి ఈ భారీ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.