close
Choose your channels

మ‌జ్ను ఆడియో రిలీజ్ ప్ర‌త్యేక‌త ఇదే..!

Friday, September 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నేచుర‌ల్ స్టార్ నాని - ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వ‌ర్మ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం మ‌జ్ను. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ & కేవ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న అనూ ఇమ్మాన్యూయేల్ న‌టించారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన క‌ళ్లు మూసి తెరిచేలోగా....సాంగ్ & టీజ‌ర్ యూత్ ని బాగా ఆక‌ట్టుకుంటుంది.

ఇక గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన మ‌జ్ను ఆడియోను ఈనెల 4న రిలీజ్ చేయ‌నున్నారు. నాని న‌టించిన‌ భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం రిలీజైన సెప్టెంబ‌ర్ 4నే మ‌జ్ను ఆడియోను రిలీజ్ చేస్తుండ‌డం విశేషం. టీజ‌ర్ తో ఆక‌ట్టుకున్న మ‌జ్ను సినిమాతో కూడా ఆక‌ట్టుకోవ‌డం ఖాయం అనిపిస్తుంది. మ‌రి...నాని మ‌జ్ను గా ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.