close
Choose your channels

ఫ్యాన్స్ వల్ల క్షమాపణలు చెప్పిన మమ్ముట్టి

Monday, August 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫ్యాన్స్ వల్ల క్షమాపణలు చెప్పిన మమ్ముట్టి

మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తన ఫ్యాన్స్ చేసిన పనికి సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకెళ్తే.. గత ఏడాది మమ్ముట్టి `పేరన్బు` అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రానికి 66వ జాతీయ అవార్డు ఇవ్వలేదని మమ్ముట్టి ఫ్యాన్స్ జాతీయ అవార్డ్ కమిటీ చైర్మన్ రాహుల్‌పై సోషల్ మీడియాలో దూషణకు దిగారు. అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్న రాహుల్ ఏకంగా మమ్ముట్టికి ఫ్యాన్స్ చర్యల గురించి చెబుతూ మెసేజ్ చేశాడు.

అంతే కాకుండా జ్యూరి నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, ప్రాంతీయ బోర్డు రిజెక్ట్ చేసిన సినిమా జాతీయ అవార్డుల పరిశీలనకే రాలేదని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దీనిపై మమ్ముట్టి వెంటనే రియాక్ట్ అయ్యారు. `సారీ సర్!..నాకు ఈ విషయాలు తెలియవు. అయినా జరిగిన దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను` అంటూ రిప్లై ఇచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.