close
Choose your channels

ఒక్కొక్కరు ముగ్గుర్ని పెళ్లి చేస్కోండి.. లేకుంటే జైలుకే..!

Tuesday, May 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఒక్కొక్కరు ముగ్గుర్ని పెళ్లి చేస్కోండి.. లేకుంటే జైలుకే..!

టైటిల్ చూడగానే ఇదేంటి.. ఒక్కొక్కరు ముగ్గుర్ని పెళ్లి చేసుకోవాలా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. కానీ ఇది మన రాష్ట్రంలో కాదు.. మన దేశంలో అస్సలే కాదండోయ్.. మీరేం టెన్షన్ పడకండి ఇదంతా స్వాజిలాండ్‌లో.. కచ్చితంగా ముగ్గుర్ని పెళ్లి చేసుకొని తీరాల్సిందేనంటూ ఆ దేశ రాజు హెచ్చరికలు జారీ చేశారు. అసలు మూడు పెళ్లిళ్ల కహానీ ఏంటి..? ఎందుకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలి..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఏంటీ మూడు పెళ్లిళ్ల గోల..!

అసలు విషయానికొస్తే.. స్త్రీ-పురుష సంఖ్యలో అసమానత కారణంగా ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెళ్లికాని వారిసంఖ్య పెరుగుతూనే ఉంది. ఇండియాలో కొన్ని కొన్ని కులాల్లో అబ్బాయిలకు అమ్మాయిలు.. అబ్బాయిలకు అమ్మాయిలు అస్సలు దొరకని పరిస్థితి ఏర్పడిందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే స్వాజిలాండ్‌లో మాత్రం అమ్మాయిలు ఎక్కువయ్యారు.. అబ్బాయిలు మాత్రం తక్కువయ్యారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నారట. అందుకే సంఖ్య సరిచేద్దామనుకున్న స్వాజిలాండ్ రాజు మెస్వాతి-3 కొన్ని రోజుల పాటు నిశితంగా ఆలోచించి ఫైనల్‌గా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే.. ఒక్కో యువకుడు తప్పనిసరిగా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్నది.. దీంతో లెక్క తేలడంతో పాటు.. అటు అబ్బాయిలు.. ఇటు అమ్మాయిలు సరి సమానం అవుతారని రాజు ఈ నిర్ణయం తీసుకున్నారు.

డెడ్ లైన్ విధింపు.. ఒక్కొక్కరికి ముగ్గురు లేకుంటే జైలుకే!

కాగా.. స్వాజిలాండ్‌కు కన్యల దేశం అని మరో పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. మొత్తానికి చూస్తే.. రాజుగారి ఆదేశాల మేరకు ఇకనుంచి ఒక్కో యువకుడు తప్పనిసరిగా ముగ్గురు యువతుల్ని పెళ్లి చేసుకొని తీరాల్సిందే అన్నమాట. అంతేకాదు ఆయన రాజు ఆదేశాలను పాటించకపోతే వారికి జైలు శిక్ష తప్పదని వార్నింగ్ సైతం ఇచ్చారు. ఇందుకోసం గాను జూన్-2019 డెడ్‌లైన్ విధించారు. ఈ లోపు ప్రతీ యువకుడు ముగ్గురు యువతుల్ని పెళ్లి చేసుకోవాల్సిందే. ఇదిలా ఉంటే.. ఆఫ్రికన్ దేశాల్లో 'పెళ్లి' అంటే అక్కడ ఘనకార్యంగా చూస్తారు. ఇలా ఒకరి కంటే ఎక్కువమంది మహిళలను పెళ్లి చేసుకోవడం ద్వారా కుటుంబం ఆర్థికంగా వృద్ది చెందుతుందని నమ్ముతుంటారు. అయితే ఆర్థిక నిపుణులు మాత్రం ఇలాంటి చర్యలతో దేశం మరింత దారిద్ర్యంలోకి నెట్టివేయబడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. సో దీనికి ఎలా పరిష్కార మార్గాలు కనుగొంటారో తెలియాల్సి ఉంది.

ముగ్గురు కంటే ఎక్కువ మందిని చేసుకుంటే..?

ప్రతీ యువకుడు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే.. ఒకవేళ మూడుకి మించి ఐదు పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందుకొచ్చిన వారికి.. ప్రభుత్వమే ఇళ్లు కూడా కట్టిస్తుందని రాజు బంపరాఫర్ కూడా ఇచ్చారు. కాగా.. స్వాజిలాండ్ రాజు మెస్వాతికి ఇప్పటికే 15మంది భార్యలు, 25 మంది సంతానం ఉన్నారన్న విషయం తెలిసిందే. అంతేకాదండోయ్.. ఆయన తండ్రికి 70మందికి పైగా భార్యలు, 150మంది సంతానం ఉన్నారు. సో.. డెడ్‌లైన్ లోపు ఒక్కో యువకుడు ఎన్నెన్ని పెళ్లిళ్లు చేసుకుంటారో..? ఎంత మంది జైలుపాలవుతారో..? ఎంతమంది తిరుగుబాటు చేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.