close
Choose your channels

Dharmana:వైవీ సుబ్బారెడ్డిపై మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు.. తంతా అంటూ వార్నింగ్..

Monday, February 26, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్దిపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు(Dharmana prasadrao) సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం పీఎస్‌ కాలనీలో కళింగ కోమటి సంఘం ఆత్మీయ సమావేశానికి ధర్మాన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ప్రజా ప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలి. ఒకరి ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదు. అయాచీతంగా దోబ్బేయాలనుకోకూడదు. నాయకుడు అవనితీకి పాల్పడకూడదు.. ఎవరు చేస్తామన్నా చేయనివ్వకూడదు. ఈ విధానాన్ని కచ్చితంగా తాను పాటిస్తా. శ్రీకాకుళానికి నేను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదు" అన్నారు.

ఈ క్రమంలోనే సుబ్బారెడ్డిపై తీవ్రంగా బూతులతో విరుచుకుపడ్డారు. "కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి.. నేను భూములు దొబ్బేస్తామన్నాడు. నువ్వు ఎవడివి..? శ్రీకాకుళం నీ.. అబ్బసొమ్ముకాదు.. గు.. మీద.. తంతా పొమ్మన్నాను. వచ్చిన వాడు ఏ పార్టీ అనేది చూడను. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అజమాయిషీ చేస్తామనుకుంటారు. అలాంటివి అవమానంగా భావిస్తా. శ్రీకాకుళంలో వనరులున్నాయనే పక్క జిల్లాల నుంచి వచ్చేస్తున్నారు. ఇలా వదిలేస్తే రౌడీలమయం అయిపోతుంది. రౌడీల చేతిలోకి వెళ్లిపోతుంది. మిగతా ప్రాంతాలు ఇలానే పాడై పోతున్నాయి. ప్రశాంతంగా పట్టణాలు ఉండాలి. దశాబ్దాలుగా.. శ్రీకాకుళం ప్రశాంతంగా ఉండాలనే చూస్తున్నా. ఇన్ని చేసినా నేను పనికి రాకపోతే.. మీ ఇష్టం. విజ్ఞతతో ఆలోచించండి. మీ అభిమానంతోనే గెలుస్తూ వస్తున్నా. జిల్లాలో ఎక్కడైనా నేను గెలుస్తా.. కానీ శ్రీకాకుళంలో వేరేవారు గెలవరు. మిగతా వారు కనీసం అభివృద్ధి కూడా చేయలేరు. గెలిస్తే శక్తివంతంగా ఉంటా.. ఓడితే స్నేహితుడిగా ఉంటా’’ అంటూ ధర్మాన వ్యాఖ్యానించారు.

దీంతో ధర్మాన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలతో పాటు వైసీపీలోనూ కలవరం రేపుతోంది. ఎన్నికల సమయంలో సాక్షాత్తూ సీఎం జగన్‌ బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డిపై ప్రభుత్వంలోనే మంత్రి బూతులు తిడుతూ విమర్శలు చేయడం సంచలనంగా మారింది. అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అసలే ఎన్నికలకు నెల రోజులు మాత్రమే సమయం ఉందని.. ఈ తరుణంలో సీనియర్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని వాపోతున్నారు. మరి ధర్మాన వ్యాఖ్యలపై వైసీపీ పెద్దలు ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.