పవన్ సినీ రీ ఎంట్రీపై నాదెండ్ల ఆసక్తికరమైన వ్యాఖ్యలు
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా పూర్తి చేసిన తర్వాత జనసేన పార్టీతో పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యారు. అయితే ఎన్నికలు తర్వాత పవన్‌కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రంగ ప్రవేశం చేశారు. అసలు పవన్‌కల్యాన్ సినీ రంగ పునః ప్రవేశంపై ఆయన సన్నిహితులు లెవరూ ఇప్పటి వరకు వ్యాఖ్యలు చేయలేదు. తొలిసారి జనసేన పార్టీ నేత, పవన్‌కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన నాదెండ్ల మనోహర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రోద్భలంతోనే పవన్‌కల్యాణ్ మళ్లీ సినీ రంగ ప్రవేశం చేశారని నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. చిరంజీవి.. పవన్‌కల్యాణ్‌ను మళ్లీ సినీ రంగ ప్రేశం చేసి సినిమాలు చేయాలని కోరడంతో పవన్ కల్యాణ్ సినీ రంగ ప్రవేశం చేశారని నాదెండ్ల పేర్కొన్నారు. ఇప్పుడు నాదెండ్ల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సినీ రంగంలోకి పునః ప్రవేశం చేసిన పవన్‌కల్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరో వైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఇలా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. మరి ఈ వ్యాఖ్యలపై చిరంజీవి మౌనంగా ఉంటారా? లేక ఏమైనా స్పందిస్తారా? అనేది చూడాలి.