close
Choose your channels

నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షురూ..

Wednesday, October 10, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షురూ..

టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య పెళ్ళి త‌ర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యింది.. నాగ చైతన్య 17 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లెంగ్తీ షెడ్యూల్ లో నాగ చైతన్య, సమంత పాల్గొంటుండగా, వీరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం..

నిన్నుకోరి ' సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.. దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజులు ఇతర ముఖ్య పాత్రలని పోషిస్తున్నారు.. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.. షైన్ స్క్రీన్ బ్యానర్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. పెళ్లి తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది..

దివ్యాన్ష కౌశిక్, రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ మరియు రాజశ్రీ నాయర్ ఇతర నటీనటులు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.