close
Choose your channels

Custody:'నిజం గెలవడానికి లేటవుతుంది.. కానీ ఖచ్చితంగా గెలుస్తుంది' : పవర్‌ఫుల్‌గా నాగ చైతన్య 'కస్టడీ' ట్రైలర్

Friday, May 5, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు అక్కినేని వారసుడు నాగచైతన్య. క్లాస్, లవ్, రోమాంటిక్ జోనర్స్‌లో మనోడికి తిరుగులేదు. అయితే మాస్ ఇమేజ్ మాత్రం ఇంకా రాలేదు. ఈ నేపథ్యంలో దాని కోసం చైతూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘‘ కస్టడీ ’’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం కస్టడీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 2.25 నిమిషాల పాటు వున్న ఈ ట్రైలర్.. సినిమాపై అంచనాలను పెంచేసింది.

శివ ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు :

నాగచైతన్య శివ అనే కానిస్టేబుల్ పాత్రలో పవర్‌ఫుల్ రోల్‌ పోషించారు. అలాగే కృతిశెట్టికి కూడా మంచి ప్రాధాన్యమున్న పాత్ర లభించింది. క్రిమినల్‌గా వున్న అరవింద్ స్వామి కోర్టుకు తీసుకెళ్లే ప్రయత్నం హీరో చేయడం అతనిని విలన్ గ్యాంగ్ అడ్డుకోవడం, కృతితో ప్రేమ, పై అధికారుల నుంచి ఒత్తిడి ఇలాంటి అడ్డంకులను శివ ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమాలో చూడాల్సిందే. సీనియర్ హీరో శరత్ కుమార్, ప్రియమణిలు కూడా కీలకపాత్ర పోషించారు. ‘‘ న్యాయం పక్కన నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది’’. ‘‘నిజం గెలవడానికి లేట్ అవుతుంది.. కానీ ఖచ్చితంగా గెలుస్తుంది’’ అంటూ చైతూ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

మే 12న ప్రేక్షకుల ముందుకు కస్టడీ :

నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ‘‘కస్టడీ’’ని నిర్మించారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. తెలుగు, తమిళ భాషల్లో మే 12న సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రేమ్ జీ అమరన్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్‌, ఆనందిలు కస్టడీలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.