close
Choose your channels

'ఆఫీసర్’ సినిమా వ్య‌వ‌థి ఎంతంటే..

Thursday, May 17, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

​‘ఆఫీసర్’ సినిమా వ్య‌వ‌థి ఎంతంటే..

కింగ్ నాగార్జున కథానాయకుడిగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన‌ సినిమా ‘ఆఫీసర్’. దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో.. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. నాగ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ యాక్షన్ అండ్ క్రైమ్ ఫిల్మ్‌లో మైరా సరీన్ కథానాయికగా నటిస్తోంది. తండ్రీకూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన జూన్ 1న విడుదల చేయడానికి నిర్మాణ వర్గాలు ప్లాన్ చేశాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నిడివి 135నిమిషాలుగా (2గంట‌ల 15నిమిషాలు) ఉండబోతోందని సమాచారం. అంతేకాకుండా.. ఈ సినిమాలో మూడు పాటలు కూడా ఉన్నాయనీ.. అందులో ఒకటి క్లబ్ సాంగ్ కాగా.. మరొకటి సెంటిమెంటల్ సాంగ్ అనీ.. ఇక మిగిలిన మూడో పాట బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో వచ్చే పాటగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కేవలం మూడు ఫైట్స్ మాత్రమే ఉంటాయని సమాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.