close
Choose your channels

నాగార్జున హర్రర్ థ్రిల్లర్ రాజు గారి గది 2 ప్రారంభం..!

Sunday, November 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున హీరోగా ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ రాజు గారి గ‌ది 2. ఈ చిత్రాన్ని పి.వి.పి & మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ ఈరోజు అన్న‌పూర్ణ స్టూడియోలో సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి రాఘ‌వేంద్ర‌రావు క్లాప్ నివ్వ‌గా నిర్మాత పి.వి.పి స్విఛ్చాన్ చేసారు. తొలి స‌న్నివేశానికి ఓంకార్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ... ఊపిరి త‌ర్వాత మా సంస్థ‌లో చేస్తున్న మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఇది. నాగార్జున గారి కెరీర్ లో మ‌రచిపోలేని చిత్రంగా నిలుస్తుంది. నాగార్జున గారి సూచ‌న‌ల‌తో స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేసాం. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తాం. ఖ‌చ్చితంగా రాజు గారి గ‌ది 2 బిగ్ హిట్ అవుతుంది అన్నారు.
ర‌చ‌యిత అబ్బూరి ర‌వి మాట్లాడుతూ.... నాగార్జున గారితో ఫ‌స్ట్ డాన్ సినిమాకి వ‌ర్క్ చేసాను. ఆత‌ర్వాత ఊపిరి...ఇప్పుడు రాజు గారి గ‌ది 2 చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.నాగార్జున గారు ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని క్యారెక్ట‌ర్ ను ఈ చిత్రంలో చేస్తున్నారు. ఆయ‌న కెరీర్ లో బెస్ట్ క్యారెక్ట‌ర్ గా నిలుస్తుంది అనేది నా న‌మ్మ‌కం అన్నారు.
సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ మాట్లాడుతూ.... ఈ మూవీకి వ‌ర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల‌వుతున్నాను. బ‌లుపు త‌ర్వాత పి.వి.పి సంస్థ‌లో నేను చేస్తున్న సినిమా ఇది. ఓంకార్ సూప‌ర్ స్ర్కిప్ట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీకి వ‌ర్క్ చేసే అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నారు.
డైరెక్ట‌ర్ ఓంకార్ మాట్లాడుతూ... గ‌త సంవ‌త్స‌రం ద‌స‌రాకు అక్టోబ‌ర్ 27న రిలీజ్ చేసిన రాజు గారి గ‌ది సినిమా సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. క‌రెక్ట్ గా ఈ సంవ‌త్స‌రం అదే రోజున అక్టోబ‌ర్ 27న నాగ్ సార్ కి క‌థ చెప్పాను. క‌థ విన్న వెంట‌నే ఓకే అన్నారు. ఇదంతా దేవుడి ద‌య వ‌ల‌న జ‌రిగింది అని న‌మ్ముతున్నాను. యాంక‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నేను చాలా క‌ష్ట‌ప‌డి ఈస్ధాయికి వ‌చ్చాను. ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని నాగార్జున గారిని ప్ర‌జెంట్ చేస్తున్నాను. నా పై పి.వి.పి గారు, నాగ్ సార్ ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బ‌డ‌తాను అన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.... నా కెరీర్ లో మ‌నం ఓ మ‌లుపు. ఆత‌ర్వాత సోగ్గాడే చిన్నినాయ‌నా, ఊపిరి చిత్రాలు చేసాను. ఆత‌ర్వాత ఏ సినిమా చేయాలి అని ఆలోచిస్తున్న‌ప్పుడు ఓం న‌మో వేంక‌టేశాయ అద్భుత‌మైన సినిమా వ‌చ్చింది. ఈ సినిమా షూటింగ్ లాస్ట్ డే రోజు అప్పుడే షూటింగ్ అయిపోయిందా అని బాధ‌ప‌డ్డాను. ఇక ఓం న‌మో వేంక‌టేశాయ త‌ర్వాత ఏ సినిమా చేయాలి అనుకుంటుంటే పివిపి, నిరంజ‌న్ వ‌చ్చి ఓంకార్ ద‌గ్గ‌ర స‌బ్జెక్ట్ ఉంది అని చెప్పారు. రెగ్యుల‌ర్ స్టోరీ అయితే వ‌ద్దు స్పెష‌ల్ గా ఉంటేనే చేస్తాను అని చెప్పాను. క‌థ విన్న వెంట‌నే న‌చ్చింది. ఇది థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ జోన‌ర్. ఎప్ప‌టి నుంచో ఈ జోన‌ర్ లో సినిమా చేయాలి అనుకున్నాను. నాకు చాలా ఇష్ట‌మైన జోన‌ర్. కానీ ఎవ‌రూ...నాకు ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి క‌థ తీసుకురాలేదు.
రాజు గారి గ‌ది సినిమా చూడ‌లేదు కానీ...ఓంకార్ గురించి తెలుసు. గ‌తంలో ఓంకార్ తో గేమ్ షో చేయాలి అనుకున్నాను కుద‌ర‌లేదు. ఓంకార్ మీద నాకు న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమాని అంద‌రికీ న‌చ్చేలా తీస్తాడు. సోగ్గాడు చిన్న‌నాయ‌నా, ఊపిరి చిత్రాల్లో క్యారెక్ట‌ర్ లా ఇందులో నా క్యారెక్ట‌ర్ చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. ఊపిరి సినిమా చేస్తున్న‌ప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో..ఈ సినిమా క‌థ విన్న త‌ర్వాత ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేస్తానా అని ఎదురుచూస్తున్నాను. నా గెట‌ప్ చాలా కొత్త‌గా ఉంటుంది. నా క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో చెప్పాలంటే...మ‌నుషుల‌తో ఆడుకుంటాను. కొత్త‌ద‌నాన్ని ఎప్పుడూ ఆద‌రించే తెలుగు ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌ని నా న‌మ్మ‌కం అన్నారు.
నాగార్జున‌, వెన్నెల కిషోర్, అశ్విన్ బాబు, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ - దివాక‌ర‌న్, మ్యూజిక్ - త‌మ‌న్, ఆర్ట్ - ఎ.ఎస్.ప్ర‌కాష్, డైలాగ్స్ - అబ్బూరి ర‌వి, నిర్మాత - పి.వి.పి, ద‌ర్శ‌క‌త్వం - ఓంకార్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.