close
Choose your channels

మరో రొమాంటిక్ ఫిల్మ్ లో సుమంత్

Sunday, February 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మళ్ళీ రావా` చిత్రంతో చాలా కాలం తర్వాత విజయాన్ని చవి చూసారు హీరో సుమంత్. కొత్త డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి అందించిన ఈ విజయంతో ప్రయోగాల వైపు పోకుండా.. తన బాడీ లాంగ్వేజ్ కి, వయసుకి నప్పే రొమాంటిక్ కథలతో పాటు భిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు సుమంత్. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం ఇదం జగత్`ను కొత్త డైరెక్టర్ అనిల్ శ్రీకాంతం దర్శకత్వంలో చేస్తున్నారు ఈ కథానాయకుడు.

ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ప్రతినాయక ఛాయలున్న ప్రెస్ ఫోటోగ్రాఫరు పాత్రలో నటిస్తున్నారు. దాదాపుగా చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. మంచి కథలతో తన వద్దకు వస్తున్న దర్శకులను చూస్తుంటే...మళ్ళీ తన కెరీర్ గాడిలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ యంగ్ హీరో. అంతేగాకుండా...మరో రొమాంటిక్ ఫిలింలో కూడా నటించబోతున్నట్లు సుమంత్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.