close
Choose your channels

సెప్టెంబ‌ర్ 28న నాట‌కం విడుద‌ల‌.. 

Saturday, September 22, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సెప్టెంబ‌ర్ 28న నాట‌కం విడుద‌ల‌.. 

నాట‌కం సినిమా సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల కానుంది. ఆశిష్ గాంధీ, ఆశిమా నెర్వ‌ల్ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ జీ గోగ‌న తెర‌కెక్కించారు. గ్రామం నేప‌థ్యంలో తెర‌కెక్కిన నాట‌కం షూటింగ్ చాలా రోజుల కిందే పూర్త‌యింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా పూర్తైపోయింది.

దాంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమా విడుదల తేదీని ప్ర‌క‌టించారు. ఈ మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. క‌థే ప్రధానంగా ఈ చిత్రం సాగ‌నుంది. సాయికార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పిఎస్వి గ‌రుడ‌వేగ ఫేమ్ అంజి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు.

శ్రీ సాయిదీప్ చ‌ట్లా, రాధికా శ్రీ‌నివాస్,ప్ర‌వీణ్ గాంధీ, ఉమా కూచిపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిజ్వాన్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో నాట‌కం సినిమా వ‌స్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.