close
Choose your channels

నిహారిక సినిమా పూర్తయ్యింది

Friday, January 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక ఒక మ‌న‌సు చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ హ్యాపీ వెడ్డింగ్` అనే సినిమా చేస్తోంది. తన మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించకపోవడంతో.. కొంత గ్యాప్ తీసుకుని ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నిహారిక‌. ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ హ్యాపీ వెడ్డింగ్`.. తాజాగా చిత్రీకరణని కూడా పూర్తిచేసుకున్నట్టు సమాచారం.

ఈ చిత్రంలో నిహారిక‌కి జోడిగా సుమంత్ అశ్విన్ నటించాడు. ఈ చిత్రంతో లక్ష్మణ్ కార్య డైరెక్టరుగా పరిచయం కానున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ ఫ్యామిలీ లవ్ స్టోరీకి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా...బాల్ రెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఈ సినిమా ఇటు నిహారిక, అటు సుమంత్ కెరీర్ల పరంగా ఎంతో కీలకమనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఒరు నాల్ల నాల్ పాతు సోల్రెన్` అనే తమిళ మూవీలో కూడా నిహారిక నటిస్తోంది. విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.