close
Choose your channels

స‌మంత‌తో అమీకి సీన్స్ లేవ‌ట‌

Thursday, November 12, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'రాజా రాణి' వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీ త‌రువాత అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో స‌మంత‌, అమీ జాక్స‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ సినిమాలో అమీ జాక్స‌న్‌ది ఫ్లాష్ బ్యాక్‌లో వ‌చ్చే పాత్ర అని.. ఆ పాత్ర‌తో విజ‌య్‌కున్న అటాచ్‌మెంట్ నేప‌థ్యంలో సినిమా న‌డుస్తుంద‌ని స‌మాచారం. అంతేకాదు.. స‌మంత‌, అమీ కాంబినేష‌న్‌లో ఎలాంటి సీన్స్ ఉండ‌వ‌ని కూడా చెన్నైవ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇంకా పేరు నిర్ణ‌యించ‌ని ఈ త‌మిళ సినిమా.. తెలుగులో కూడా అనువాదం కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.