close
Choose your channels

ఆస్కార్ బ‌రిలో ఈసారి కూడా లేదు...

Tuesday, December 18, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆస్కార్ బ‌రిలో ఈసారి కూడా లేదు...

ఆస్కార్స్ 2018 బ‌రిలోని ఉత్త‌మ విదేశీ చిత్రంగా మ‌న‌దేశం త‌ర‌పున 'విలేజ్ రాక్‌స్టార్స్‌' ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. ఇది అస్సామీ చిత్రం. అయితే ఆస్కార్ ఎంపికలో భాగంగా తదుప‌రి జ‌రిగిన ఎంపిక‌లో ఈ చిత్రం ఎంపిక కాలేదు.

దీంతో 2018లో ఇండియన్ సినిమా ఆస్కార్ బ‌రి నుండి నిష్క్ర‌మించిన‌ట్లే. రీమా దాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రం 2017లో విడుద‌లైంది. పేద చిన్నారులు త‌మ బాధ‌ను దిగ‌మింగుకుని, త‌మ జీవితాల‌ను సంతోషంగా ఎలా మ‌లుచుకున్నార‌నేదే ఈ సినిమా క‌థాంశంగా అస్సాంలోని చైగావ్ గ్రామంలో ఈ సినిమాను రీమా దాస్ తెర‌కెక్కించారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 22న నామినేటెడ్ చిత్రాల‌ను ఆస్కార్స్ ప్ర‌క‌టించ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 24న ఆస్కార్ వేడుక అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.