close
Choose your channels

'య‌న్‌.టి.ఆర్' ఆడియో డేట్

Wednesday, November 21, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

య‌న్‌.టి.ఆర్ ఆడియో డేట్

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' అనే రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నాడు. తాజా స‌మాచారం ప్రకారం ఎం.ఎం.కీర‌వాణి సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌ను డిసెంబ‌ర్ 16న తిరుప‌తిలో విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తుంది.

చిత్ర యూనిట్‌, సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ ఆడియో వేడుక‌లో పాల్గొన‌బోతున్నారు. య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు జ‌న‌వ‌రి 9న.. య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు జ‌న‌వ‌రి 24న విడుద‌ల‌వుతుంద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. అయితే రెండో భాగం పోస్ట్ పోన్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.