close
Choose your channels

ఒక మనసు టీజర్ అదిరింది..

Monday, May 16, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న నిహారిక న‌టించిన చిత్రం ఒక మ‌న‌సు. ఈ చిత్రంలో నాగ శౌర్య - నిహారిక జంట‌గా న‌టించారు. రామ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 18న ఒక మ‌న‌సు ఆడియో రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ఒక మ‌న‌సు టీజ‌ర్ రిలీజ్ చేసారు. డైరెక్ట‌ర్ రామ‌రాజు తొలి చిత్రం మ‌ల్లెల తీరం క్లాస్ మూవీ.
ఒక మ‌న‌సు కూడా రామ‌రాజు అభిరుచికి త‌గ్గ‌ట్టు క్లాస్ మూవీగా రూపొందించారు అని టీజ‌ర్ ని చూస్తే తెలుస్తుంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఇస్తున్న నిహారిక వెండితెర పై ఎలా క‌నిపించ‌నుంది..అనే ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే ఆస‌క్తిని మ‌రింత పెంచేలా చ‌క్క‌గా చీర క‌ట్టులో నిహారిక ఆక‌ట్టుకుంది. ఏకాంతంలో ప్రేమికుల మాట‌లు ఎలా ఉంటాయో...ప్రేమ‌లో ప‌డ్డ వాళ్ల‌కు ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. నిజంగా ఇద్ద‌రు ప్రేమికులు ఎలా మాట్లాడుకుంటారో..అలాగే ఉన్న నాగ శౌర్య - నిహారిక మాట‌లు యువ‌త‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటాయి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. చ‌క్క‌ని సంభాష‌ణ‌లు...దానికి త‌గ్గ‌ట్టు సంగీతం... మొత్తానికి ఒక మ‌న‌సు టీజ‌ర్ అదిరింది.. టీజ‌ర్ లో ఆక‌ట్టుకున్న నిహారిక ఇక సినిమాలో ఎలా న‌టించిందో...చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.