close
Choose your channels

Telangana Elections 2023 :మిగిలింది వారం మాత్రమే.. తెలంగాణలో హోరెత్తనున్న ప్రచారం..

Wednesday, November 22, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మిగిలింది వారం మాత్రమే.. తెలంగాణలో హోరెత్తనున్న ప్రచారం..

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి మరో వారం మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీల నేతలు ప్రచారం ముమ్మరం చేయనున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలందరూ తెలంగాణకు తరలిరానున్నారు. రేపటితో రాజస్థాన్ ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో వెంటనే తెలంగాణపై ఫోకస్ చేయనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర రాష్ట్రాల ముఖ్యలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఇక బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి నేతలు ప్రచార బరిలో దిగనున్నారు.

మిగిలింది వారం మాత్రమే.. తెలంగాణలో హోరెత్తనున్న ప్రచారం..

ప్రధాని మోదీ ఈనెల 25 నుంచి 27వరకు రాష్ట్రంలోనే మకాం వేయనున్నారు. ఈనెల 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో పాల్గొంటారు. 26న తూఫ్రాన్‌, నిర్మల్‌ నియోజకవర్గాల్లో, 27న మహబూబాబాద్‌, కరీంనగర్‌లో నిర్వహించే బహిరంగ సభలకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహిస్తారు. ఇక అమిత్‌ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగి కూడా పలు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కూడా బీజేపీ-జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ రాష్ట్రంతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు .

<

మిగిలింది వారం మాత్రమే.. తెలంగాణలో హోరెత్తనున్న ప్రచారం..

p style="text-align:justify">ఇక కాంగ్రెస్ తరపున టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర నాయకులంతా ఉధృతంగా ప్రచారం చేస్తుండగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా రాష్ట్రంలోనే ఉండి ప్రచారం చేయనున్నారు. వీరితో పాటు కర్ణాటకకు చెందిన ప్రముఖ నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యలు కూడా కాంగ్రెస్ అభ్యర్థుల తరపున క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆఖరి వారం రోజులు కావడంతో తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు.

 

మిగిలింది వారం మాత్రమే.. తెలంగాణలో హోరెత్తనున్న ప్రచారం..

ఇదిలా ఉంటే అధికార బీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్ రోజుకు మూడు, నాలుగు సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు కేటీఆర్, హరీష్ రావు, కవిత కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. ప్రచారం తుది దశకు చేరుకోవడంతో ఊరు వాడా పర్యటనలు చేస్తున్నారు. ఈనెల 25న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ మరికొన్ని ప్రజాకర్షణ హామీలు ఇవ్వనున్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఈ వారం రోజులు రాష్ట్రమంతా అన్ని పార్టీల అగ్రనేతల పర్యటనలతో మైకులు మోత మోగనున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.