close
Choose your channels

స్పెష‌ల్ సాంగ్ లో పూన‌మ్ బ‌జ్వా కాదు సోన‌మ్ బ‌జ్వా..

Wednesday, March 16, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కిస్తున్న చిత్రం బాబు..బంగారం. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టిస్తున్నారు. ఈ చిత్రం కోసం వెంకీ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ చిత్రీక‌రిస్తున్నారు. అయితే ఈ స్పెష‌ల్ సాంగ్ ని వెంకీ, సోన‌మ్ బ‌జ్వా ల‌పై చిత్రీక‌రించార‌ట‌.

సోన‌మ్ బ‌జ్వా అంటే కొంత‌మంది పూన‌మ్ బ‌జ్వా అనుకుంటున్నారట‌. సోన‌మ్ బ‌జ్వా సుశాంత్ హీరోగా న‌టిస్తున్న ఆటాడుకుందా రా సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమాని జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కాలేదు అప్పుడే వెంకీ తో స్పెష‌ల్ సాంగ్ చేసిసింది సోన‌మ్. మ‌రి.. ఆటాడుకుందా రా రిలీజ్ త‌ర్వాత ఈ అమ్మ‌డు ఇంకెన్ని ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.