close
Choose your channels

‘పవర్ స్టార్’ ట్రైలర్‌ లీక్.. మేమే బాధ్యత వహిస్తాం: వర్మ

Wednesday, July 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘పవర్ స్టార్’ ట్రైలర్‌ లీక్.. మేమే బాధ్యత వహిస్తాం: వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. నేటి(బుధవారం) ఉదయం 11 గంటలకు ఆ సినిమా ట్రైలర్ విడుదల కావాల్సి ఉంది. దీనికి ఒక్కొక్కరి నుంచి రూ.25 వర్మ వసూలు కూడా చేశారు. అయితే తాజాగా తన ‘పవర్ స్టార్’ సినిమా ట్రైలర్ లీక్ అయిందని.. మా ఆఫీస్ స్టాఫ్‌లోని ఒకరు లీక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నామన్నారు. తీసుకున్న డబ్బులన్నీ త్వరలోనే రిటర్న్ చేస్తామని ఆర్జీవీ తెలిపారు.

‘పవర్ స్టార్’ ట్రైలర్‌ లీక్.. మేమే బాధ్యత వహిస్తాం: వర్మ

‘‘పవర్ స్టార్’ సినిమా ట్రైలర్‌ను 11 గంటలకు విడుదల చేద్దామనుకున్నాం కానీ ఈలోపే అది లీక్ అయింది. మా ఆఫీస్ స్టాఫ్‌లోనే ఒకరు ఈ పని చేసినట్టుగా మేము అనుమానిస్తున్నాం. దీనికి పూర్తి బాధ్యత మేము వహిస్తాం. ఎవరైతే ట్రైలర్ కోసం డబ్బు పెట్టారో వారందరికీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరలో మేము డబ్బు రిటర్న్ చేస్తాం’’ అని వర్మ ట్వీట్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos