close
Choose your channels

అనుష్కతో డేటింగ్, లవ్, పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ

Thursday, August 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనుష్కతో డేటింగ్, లవ్, పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి రెండ్రోజులకోసారి వార్తలు వస్తూనే ఉంటాయన్న విషయం విదితమే. గత కొన్ని రోజులుగా మళ్లీ ప్రభాస్ పెళ్లిపై వార్తలు షురూ అయ్యాయి. వార్తలే కాదు.. అమెరికా అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు.. అనుష్కతో డేటింగ్ చేస్తున్నట్లు, ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు కూడా పుంకాలు.. పుంకాలుగా వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నింటిపై తాజాగా ‘సాహో’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ క్లారిటీ ఇచ్చేశారు.

అనుష్కతో పెళ్లిపై..!

"మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేదు. మేమిద్దరం అమెరికాలో ప్రత్యేకంగా ఇల్లు కొన్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. అనుష్క నాకు మంచి స్నేహితురాలు మాత్రమే. అనుష్క నేను ప్రేమలో ఉన్నామని మీరు అంటున్నదే నిజమైతే గత రెండేళ్లుగా మేం ఎక్కడైనా కలిసి కనిపించామా? అనుష్కను కలిసి రెండేళ్లకు పైగానే అయింది. నేను అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి అవి నిజం కాదని అలాగే అనుష్క తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అది కూడా నిజం కాదు" అని ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు.

అమెరికా అమ్మాయితో పెళ్లి!

ఇటీవల అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కుమార్తెను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయని.. ఆ వార్తలన్నీ అస్సలు నిజం కాదని ప్రభాస్ తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూయర్ నుంచి పలు ప్రశ్నలు ఎదురవ్వగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును హ్యాండ్సమ్‌ అని.. దీపికా పదుకొనే, అలియా భట్‌లతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు తన మనసులోని మాటను ప్రభాస్ బయటపెట్టారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.