close
Choose your channels

ఎన్టీఆర్ బర్త్ డే.. ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Wednesday, May 20, 2020 • తెలుగు Comments

ఎన్టీఆర్ బర్త్ డే.. ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. మరోవైపు అభిమానులు సైతం పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా కష్టకాలం కావడంతో ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్.. కుటుంబ సభ్యులతోనే వేడుకలు జరుపుకున్నాడు. అదే విధంగా అభిమానులంతా ఇంట్లోనే ఉంటే అదే తనకు పెద్ద గిఫ్ట్ అన్నాడు. ఈ సందర్భంగా ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

నాకు తెలిసొచ్చింది..

‘ఒక న్యూక్లియర్ ప్లాంట్ పక్కన కూర్చుంటే ఎలా వుంటుందో చివరికి నాకు తెలిసొచ్చింది. నీ చుట్టూ వుండే ఆ క్రేజీ ఎనర్జీని తట్టుకోవడానికి మళ్లీ వచ్చినప్పుడు రేడియేషన్ సూట్ తెచ్చుకుంటానులే.. హ్యాపీ బర్త్ డే సోదరా’ అని ప్రశాంత్ నీల్ ఓ క్రియేటివిటీ ట్వీట్ వదిలాడు. ఈ ట్వీట్‌ను బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా.. ఈ కాంబోలో ఓ భారీ చిత్రం ఉంటుందని చాలా రోజులగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ కాంబినేషన్‌లోని భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్నారని ఇది పాన్ ఇండియా మూవీ అని పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాదు ఒకట్రెండు సార్లు కలుసుకుని దీనిపై చర్చించుకున్నారని.. ప్రాజెక్ట్ కూడా ఓకే అయిందని కూడా టాక్ నడిచింది. తాజా ట్వీట్‌ను బట్టి చూస్తే ఇది పక్కా అని తేలిపోయింది.

Get Breaking News Alerts From IndiaGlitz