close
Choose your channels

'ప్రేమకు రెయిన్ చెక్' సెప్టెంబరు 7 న విడుదల

Tuesday, September 4, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రేమకు రెయిన్ చెక్ సెప్టెంబరు 7 న విడుదల

"రెయిన్ చెక్" అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం "ప్రేమకు రెయిన్ చెక్".ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిస్తుండడం విశేషం.అభిలాష్ వాడడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబరు 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్బంగా హీరో అభిలాష్ మాట్లాడుతూ – “నా తొలి సినిమా .‌ మా టీమ్ కు ఈ సినిమా ఒక డ్రీమ్. మా వర్క్ ఎంటనేది ఇప్పటికే ట్రైలర్ లొ చూశారు.మా టీమ్ అందరం దిబెస్ట్ ఔట్పుట్ వచ్చెలా "ప్రేమకు రెయిన్ చెక్" కు వర్క్ చేశాం. కార్పొరెట్ లవ్ స్టొరీ ఎవ్వరిని డిజప్పాయింట్ చెయ్యద. మా వర్క్ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాము అన్నారు”

హీరోయిన్ ప్రియా, మౌనిక మాట్లాడుతూ – “దర్శకులు ఆకెళ్ల పేరి శ్రీనివాస్ గారు చాలా క్లారిటీగా ఈ సినిమా చేశారు. సినిమాలొ ప్రతి పాత్ర బ్యూటిఫుల్ గా ఉంటాయి”. సినిమా అందరికీ నచ్చుతుందన్నారు.

సంగీత దర్శకులు దీపక్ కిరణ్ మాట్లాడుతూ – “ఈ చిత్రం పాటలని ప్రోత్సహించినందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు, చిత్రం లో విసుఅల్స్, కథ, కథనం ప్రకారం ఫ్రెష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మీ ముందుకు ‘ప్రేమకు రెయిన్ చెక్’ రాబోతుంది. మీ అందరి మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాము” అని తెలిపారు.

ఆకెళ్ల పేరి శ్రీనివాస్ మాట్లాడుతూ – “ఎడ్వెంచర్ స్పొర్ట్స్ ఆఫీస్ నేపధ్యంలో నడిచె సినిమా ఇది. లవ్ , అడ్వెంచర్, పెయిన్, ఫన్ ఇలా అన్నీ అంశాలు ఈ సబ్జెక్ట్ లొ ఉంటాయి. రియల్ గా అడ్వెంచర్ మా నటీనటులు చెయటం విశేషం. ఈ చిత్రం లో కథా కథనం తో పాటు ముఖ్యం గా ఆకట్టుకునే అంశాలు – లార్జర్ థన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విసుఅల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఓవర్ అల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులని అలరిస్తుందని భావిస్తున్నాము” అని తెలుపుతూ “స్టోన్ మీడియా ఫిల్మ్స్ ఆండీ కోహెన్ మరియు అతని సంస్థ కోసం ఒక ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశాము.

మా సినిమా చూసి నచ్చి అంతర్జాతీయ భాషలలో చిత్రీకరించి ప్రపంచవ్యాప్తం గా విడుదల చేయటానికి హాలీవుడ్ చిత్రాల సమర్పకులు ఆండీ కొహెన్ ముందుకు వచ్చారు. శరత్ మరార్ గారు మా వర్క్ నచ్చి ఈ సినిమాను తెలుగులో సర్పిస్తున్నారు. సినిమాకు కంటెంట్ ఇంపార్టెంట్. అలాగే సినిమాటిక్ ఎక్స్ పిరియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మా చిత్రంలో ఈ రెండు ఉంటాయి. టీమ్ వర్క్ మా సినిమాకు ప్రధాన బలం‌. ప్రతి అంశం దిబెస్ట్ అన్పించెలా ‘ప్రేమకు రెయిన్ చెక్’ ఉంటుంది.

హాలీవుడ్ మరియు అంతర్జాతీయ భాషలలో రాబోతున్న ‘ప్రేమకు రెయిన్ చెక్’: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంకో ముఖ్యమైన విషయం, ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలలో నిర్మించాలని హాలీవుడ్ నిర్మాత ఆండీ కోహెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వార తెలిపారు. ఆండీ కోహెన్ చిత్రం మరియు టెలివిజన్ ఉత్పత్తిలో పాల్గొన్న US ఆధారిత ఉత్పత్తి మరియు కన్సల్టెన్సీ సంస్థ గ్రేడ్ A ఎంటర్టైన్మెంట్ అధ్యక్షుడు. ఆయన నేతృత్వంలో, స్టోన్ మీడియా ఫిల్మ్స్తో చేతులు కలిపి ప్రపంచవ్యాప్తంగా “ప్రేమకు రెయిన్ చెక్” ప్రోత్సహించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

ఆండీ కొహెన్ మాట్లాడుతూ - “ప్రేమకు రెయిన్ చెక్ యూనివర్సల్ సబ్జెక్ట్. "ప్రేమాకు రెయిన్ చెక్" లేదా "రెయిన్ చెక్ టు లవ్" గురించి మనకు చాలామంది ఉత్తేజపరిచే విషయం ఏంటి అంటే ఇది ఈ సార్వత్రిక భావనను తీసుకుని పాత్రలను, వినోదభరితమైన ప్లాట్లతో మేము ఏ దేశం లేదా సంస్కృతి నుండి ఉన్నా ఆకట్టుకునే కథాంశం. ఈ కథాంశం భారతదేశం లో ఉన్న ప్రేక్షకులకి పరిమితం కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా అందచేయ్యాలి అన్నదే మా ఉద్దేశం. చిత్రం తాజాగా మరియు ఆసక్తికరంగా ఉంచే మలుపులతో నిండి ఉంటుంది. ప్రతిభావంతులైన నటీనటులు ఈ చిత్రానికి, వారి పాత్రలకి అనుగుణం గా బాగా చేసారు.

ఈ చిత్రం ప్రొడక్షన్ విలువలు హాలీవుడ్ చిత్రాలకి ఎ మాత్రం తీసి పోదు. డైరెక్టర్, అకాళ్ల పెర్రి శ్రీనివాస్ మొదటి చిత్రం అయినప్పటికీ, తన కథ చెప్పే విధానం చూసాక ఇది ఖచ్చితంగా తన చివరిది కాదని నిరూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అప్పీల్ చేస్తానని భవిష్యత్ ప్రాజెక్టులలో అతనితో కలిసి పనిచేయడానికి నేను ఎదురు చూస్తున్నాను”

అభిలాష్ వాడడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం, రఘు కారుమంచి, కిరీటి దామరాజు, కల్కీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దీపక్ కిరణ్, ఛాయాగ్రహణం: శరత్ గురువుగారి. సమర్పణ: నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: ఆకెళ్ళ పేరి శ్రీనివాస్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.