close
Choose your channels

తిరుగులేని సక్సెస్ తో దూసుకెళ్తోన్న 'పిఎస్ వి గరుడవేగ'

Tuesday, November 14, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పిఎస్‌వి గ‌రుడ‌వేగ‌...క‌మ్ బ్యాక్ మూవీ ఆఫ్ డా.రాజ‌శేఖ‌ర్‌...సీట్ ఎడ్జ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌..సూప‌ర్బ్ స్క్రిప్ట్‌..

`పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18 ఎం` సినిమా గురించి విన‌ప‌డుతున్న వార్త‌లు. టీజ‌ర్ విడుద‌లైన‌ప్పుడు మొద‌లైన సినిమా ప్ర‌భంజ‌నం ఇంకా కొన‌సాగుతుండ‌టం విశేషం. సినిమా చూసిన ప్రేక్ష‌కులే కాదు.. సినీ ప్ర‌ముఖులు, మ‌హేష్ వంటి స్టార్ హీరోలు..ఇలాఅంద‌రూ సినిమా అద్భుతంగా ఉంద‌ని అప్రిసియేట్ చేస్తున్నారు. ఒక‌ప్పుడు యాంగ్రీ యంగ్ మేన్‌గా తిరుగులేని విజ‌యాల‌ను సాధించిన డా.రాజ‌శేఖ‌ర్‌కు పిఎస్‌వి గ‌రుడ‌వేగ స‌క్సెస్‌తో మంచి పేరొచ్చింది.

జ్యోస్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బేన‌ర్‌పై ఎం.కోటేశ్వ‌ర్ రాజు నిర్మించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌. న‌వంబ‌ర్ 3న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. ఎప్పుడో పాతికేళ్ల క్రితం చూసిన హీరో డా.రాజ‌శేఖ‌ర్ అదే ఎన‌ర్జీతో తెర‌పై క‌న‌ప‌డుతున్నారు. ఆయ‌న ఎన‌ర్జీకి, మంచి క‌థ‌, స్క్రిప్ట్‌, మేకింగ్ వాల్యూస్ తోడైతే సినిమా తిరుగులేని విజ‌యాన్ని సాధిస్తుంద‌న‌డానికి గ‌రుడ‌వేగ సినిమా పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుద‌లైన ఐదు రోజుల్లోనే 15 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి, తెలుగు సినిమా స్టామినాను నిరూపించింది. అలాగే ప‌దిరోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా 22 కోట్ల‌కు రూపాయ‌ల క‌లెక్ష‌న్స్‌ను సాధించి అంద‌రినీ ఔరా! అనిపిస్తుంది. విడుద‌లైన రెండు వారాలు త‌ర్వాత ఎన్నిచిత్రాలు విడుద‌ల‌వుతున్న‌ప్ప‌టికీ గ‌రుడ‌వేగ థియేట‌ర్స్ సంఖ్య పెరుగుతుందే కానీ, త‌గ్గ‌డం లేదు. యు.ఎస్‌లో కూడా థియేట‌ర్స్ సంఖ్య నిల‌క‌డ‌గా ఉండ‌టం విశేషం. ట్రేడ్ వర్గాల అంచ‌నాల‌ను మించి..ఈ సినిమా విజ‌య‌వంత‌మైన మూడో వారంలోకి అడుగుపెట్ట‌నుంది.

అమేజింగ్ డైరెక్ష‌న్‌, అమోఘ‌మైన స్క్రిప్ట్‌, అందుకు త‌గిన విధంగా డిజైన్ చేసిన పాత్ర‌లు, ఆ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు స‌రిపోయిన న‌టీనటుల పెర్ఫార్మెన్స్‌...డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు టేకింగ్‌, ధ‌ర్మేంద్ర కాక‌రాల ఎడిటింగ్‌, భీమ్స్‌ సిసిరోలియో అందిం చిన సన్నిలియోన్ డియో డియో సాంగ్, శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించిన పాట‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, అంజి, సురేష్‌ రగుతు, శ్యామ్‌ ప్రసాద్‌, బకూర్‌ చికోబవా సినిమాటోగ్ర‌ఫీ, కోటేశ్వ‌ర్ రాజుగారి మేకింగ్ వాల్యూస్ స‌హా టెక్నిక‌ల్ టీం స‌పోర్ట్ ..సినిమా ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్స్‌లో ఉండేలా మ‌రో లెవ‌ల్‌కు తీసుకెళ్లింది. సినిమా టీజ‌ర్ విడుద‌లైనప్ప‌టి నుండే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచనాల‌కు ధీటుగా సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.