close
Choose your channels

పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ అప్‌డేట్‌

Wednesday, June 13, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ అప్‌డేట్‌

బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు, కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ బ‌యోపిక్ రాబోతున్న‌ట్లు గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. గ‌రుడ‌వేగ‌తో ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్న ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో సుధీర్ బాబు ఈ సినిమా చేయ‌బోతున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డం ఆల‌స్య‌మైంది. తాజాగా.. సెప్టెంబ‌ర్ నుంచి ఈ సినిమా ప్రారంభం కానుంద‌ని సుధీర్ బాబు పేర్కొన్నారు.

అలాగే తెలుగు, హిందీ భాష‌ల్లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారు. సినిమా వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉండడం కోసం.. గోపీచంద్‌ ద‌గ్గ‌ర ఇన్‌పుట్స్ తీసుకోవ‌డంతో పాటు.. కొన్ని నిజ‌మైన ఇంట‌ర్నేష‌న‌ల్ టోర్నీల్లో కూడా పాల్గొన‌బోతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

స్వ‌త‌హాగా బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ అయిన‌ త‌న‌కు ఈ సినిమా ఛాలెంజివ్‌గా నిలిచే విష‌యంగా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం స‌మ్మోహ‌నం ఈ నెల 15న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.