close
Choose your channels

10 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటున్న రాశీ ఖ‌న్నా..!

Tuesday, August 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న అందాల క‌థానాయిక రాశీ ఖ‌న్నా. ఆత‌ర్వాత జోరు, జిల్, శివ‌మ్, బెంగాల్ టైగ‌ర్, సుప్రీమ్ చిత్రాల్లో న‌టించింది. క‌రెక్టే కానీ...10 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అన‌డం ఏమిటి అనుకుంటున్నారా..? రాశీ ఖ‌న్నా ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చి టు ఇయ‌ర్సే అయ్యింది.

అయితే.... తెలుగు ప్రేక్ష‌కులు చూపించే ప్రేమ చూస్తుంటే...2 ఇయ‌ర్స్ కాదు ఓ ప‌దేళ్ల నుంచి ఇక్క‌డ ఉంటున్న ఫీలింగ్ క‌లుగుతుంది అని చెబుతుంది. అంతే కాకుండా... సుప్రీమ్ సినిమాలో బెల్లం శ్రీదేవి పాత్ర మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఏ ఫంక్ష‌న్ కి వెళ్లినా బెల్లం శ్రీదేవి అంటూ పిలుస్తున్నారు అంటూ త‌న సంతోషాన్ని పంచుకుంది. తాజాగా హైప‌ర్ చిత్రంలో రామ్ స‌ర‌స‌న న‌టిస్తున్నాను. డిఫ‌రెంట్ గా ఉండే ఈ పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. వ‌చ్చే నెల‌లో ఓ త‌మిళ చిత్రంలో న‌టిస్తున్నాను. తెలుగు ఆడియోన్స్ ఆద‌రించిన‌ట్టే...త‌మిళ్ ఆడియోన్స్ కూడా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను అంటుంది రాశీఖ‌న్నా.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.